వైఎస్ వివేకా కుమార్తె లేఖపై స్పందించిన ఎస్పీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. నిందితుల ఇళ్లలోనే వివేకా హత్యకు వాడిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్న అధికారులు ఇవాళ పలువురు స్థానిక నేతలను ప్రశ్నించారు.. మరోవైపు.. తమ ప్రాణాలకు ముప్పు ఉందని వైస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఆ తర్వాత సునీత లేఖపై స్పందించారు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్.. సునీత కుటుంబ రక్షణ కోసం చర్యలను చేపట్టామని తెలిపారు.. వారికి వ్యక్తిగత రక్షణ కల్పించడంతో పాటు, పులివెందులలో వారి నివాసం వద్ద సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.. ఇక, లేఖలో సునీత పలు విషయాలను పేర్కొన్నారని… వాటిపై కూడా విచారణ చేస్తామని తెలిపారు ఎస్పీ..
కాగా, తన తండ్రి హత్యపై న్యాయపోరాటం చేస్తున్న సునీతారెడ్డి.. ఈ కేసు విషయంలో ఢిల్లీ వరకు కూడా వెళ్లివచ్చారు.. మధ్య మధ్యలో సీబీఐ అధికారులను కలుస్తూ ఆరా తీస్తున్నారు.. ఈ నేపథ్యంలో.. ఈనెల 10వ తేదీ సాయంత్రం 5.20 గంటలకు ఒక అనుమానితుడు తమ ఇంటి చుట్టూ తిరిగారని కడప ఎస్పీకి రాసిన లేఖలో పేర్కొన్నారు సునీత. ఆ తర్వాత కొన్ని ఫోన్ కాల్స్ కూడా వచ్చాయని.. వివేకా హత్య కేసు అనుమానితుడు శివశంకర్ రెడ్డి పుట్టినరోజున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఉన్న మణికంఠరెడ్డి అనే వ్యక్తి మాదిరే అతను ఉన్నాడని.. దీంతో.. తమ కుటుంబ భద్రత పట్ల ఆందోళన కలుగుతోందని ఆ లేఖలో పేర్కొన్నారు సునీత.
Also Read
- OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!