Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్‌షీట్‌పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో నమోదైన కేసులకు సంబంధించి సీఐడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లోని అంశాలపై ముంబై సినీ నటి కాదంబరి జెత్వానీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను, తన కుటుంబ సభ్యులను అన్యాయంగా ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె ఒక వీడియో ప్రకటనను విడుదల చేశారు. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో తమపై ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. దర్యాప్తు సమయంలో తన వాంగ్మూలాన్ని, వాదనలను పూర్తిగా పక్కనపెట్టి వాస్తవాలను వక్రీకరించారని, కొన్ని మీడియా సంస్థలు కూడా అసత్య కథనాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. దాదాపు రెండున్నర సంవత్సరాల సుదీర్ఘ అన్యాయ పోరాటం తర్వాత తమ కుటుంబం నిర్దోషిగా తేలినప్పటికీ, కేవలం 20 పేజీల సీఐడీ ఛార్జ్‌షీట్‌లో తనపై నిరాధారమైన ఆరోపణలు మోపడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని పేర్కొన్నారు.
ఆర్థిక లావాదేవీలపై స్పష్టత
కుక్కల విద్యాసాగర్ తన ఖాతాలో జమ చేసిన రూ. 4.5 లక్షలు, కాల్ రికార్డులను సీఐడీ నేర ఆధారాలుగా చూపించడంపై జెత్వానీ స్పందించారు. ఆ డబ్బు తాను చేసిన పనికి లభించిన పారితోషికం అని, విద్యాసాగర్ దానిని స్వచ్ఛందంగానే చెల్లించారని స్పష్టం చేశారు. ఇంకా రావాల్సిన బకాయిల కోసం మాత్రమే అతనిని సంప్రదించాల్సి వచ్చిందని, ఇవి ఏమాత్రం నేరపూరిత లావాదేవీలు కావు అని వివరించారు. ఈ స్వల్ప లావాదేవీని రూ. 1.32 కోట్లుగా చిత్రించడం, ఛార్జ్‌షీట్‌లో “తప్పుడు అత్యాచార కేసు బెదిరింపులు”, “బ్లాక్మెయిల్”, “ర్యాకెట్” వంటి తీవ్రమైన పదాలను ఉపయోగించడం ఒక అవివాహిత యువతిపై చేసిన దారుణమైన అన్యాయమని వాపోయారు.
Also Read
- CM Chandrababu : భూములకు బ్లాక్‌చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్‌కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
- Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
వేధింపులు , సీఐడీ తీరుపై విమర్శలు
విద్యాసాగర్ నేరపూరిత నేపథ్యం తెలిసిన వెంటనే తాను అతని వివాహ ప్రతిపాదనను తిరస్కరించానని నటి తెలిపారు. దాంతో కక్ష పెంచుకున్న విద్యాసాగర్ తనకు నగ్న సెల్ఫీలు పంపి మానసికంగా వేధించాడని, చివరికి ఆ ఫోటోనే సీఐడీ “అభ్యంతరకర ఫోటో”గా చూపించడం విచారకరమని అన్నారు. ఫిర్యాదుదారుడితో తన పరిచయం , ఆర్థిక లావాదేవీలు పదేళ్ల క్రితమే ముగిసిపోయాయని తెలిపారు. ఇదే వ్యవహారంలో గతంలో గౌరవ న్యాయస్థానంలో జరిగిన విచారణ ఆధారంగా విద్యాసాగర్‌తో పాటు ముగ్గురు సస్పెండైన సీనియర్ ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. సాక్షుల వాంగ్మూలాలను వక్రీకరించి తనపై కేసు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికైనా నిష్పాక్షికమైన దర్యాప్తు జరిగి నిజం గెలవాలని ఆమె ఆకాంక్షించారు.
ఛార్జ్‌షీట్‌లో ఆరోపణలను ఖండించిన నటి#
రూ.4.5 లక్షల లావాదేవీలపై వివరణ#
సీఐడీ దర్యాప్తుపై తీవ్ర అభ్యంతరాలు#
నిష్పాక్షిక విచారణ కోరిన కాదంబరి
తాజావార్తలు
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్‌షీట్‌పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?