అమరావతి: సచివాలయంలోని తన కార్యాలయంలో కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఈరోజు ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రెండు కీలక ఫైళ్లపై ఆయన తొలి రెండు సంతకాలను చేశారు. తొలి సంతకాన్ని విశాఖలో లక్ష మంది మహిళలకు ఇళ్ళు కట్టించే ఫైలుపై చేశారు. రెండో సంతకాన్ని గృహ నిర్మాణ లబ్దిదారులకు ఇచ్చే 90 బస్తాల సిమెంట్‌ను 140 బస్తాలకు పెంచే ఫైలుపై చేశారు.
అనంతరం సీఎం జగన్‌పై మంత్రి జోగి రమేష్ ప్రశంసలు కురిపించారు. పాదయాత్రలో ప్రతి గ్రామంలో పేదలు కష్టాలను జగనన్న తెలుసుకున్నారని.. ఆ కష్టాలను చూసి పేదలకు ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారని మంత్రి జోగి రమేష్ తెలిపారు. పేదలకు సేచురేషన్ పద్ధతిలో ఇళ్లు కట్టిస్తున్నామని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేస్తున్న సీఎం జగన్ అభినవ పూలే అని, అంబేద్కర్ అసలైన వారసుడు అని కీర్తించారు. కాగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోగి రమేష్‌కు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మంత్రి మేరుగ నాగార్జున, వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుభాకాంక్షలు తెలియజేశారు.
Dharmana: మంత్రి ధర్మాన ఆసక్తికర వ్యాఖ్యలు.. కేవలం నిజాయితీవల్లే సాధ్యం..!