NTV Telugu Site icon

Cybercrime : మత్యశాఖ జేడీకి సీబీఐ కాల్.. 7.6 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

Untitled 3

Untitled 3

Vijayawada: ఆంధ్ర రాష్ట్ర మత్స్య శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వి.వెంకటేశ్వరరావు సైబర్ క్రైమ్ కి గురైయ్యారు. ఈ క్రైమ్ లో ఆయన లక్షల రూపాయలను పోగొట్టుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. గత నెల 27 వ తేదీన వి.వెంకటేశ్వరరావు పెనమలూరు కూడలి లోని రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్‌ కార్యాలయానికి వెళ్తున్న తరుణంలో ఆయనకి ట్రాయ్‌ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా) పేరుతో ఓ ఫోన్‌ వచ్చింది. ఈ క్రమంలో ఆయన ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడగా.. అవతలి వాళ్ళు చెప్పిన విషయం విని విస్తుత పోయారు. కొంత కాలం క్రితం ముంబయిలో మీ ఆధార్‌ నంబరుతో వి.వెంకటేశ్వరరావు పేరు పైన ఓ సిమ్‌ కార్డు కొన్నారని.. అలానే ఆ సిం కార్డు నుండి ఓ మహిళలకు అసభ్యకర సందేశాలు, ఫోన్లు వెళుతున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. ఇది విన్న వి.వెంకటేశ్వరరావు నిర్ఘాంత పోయారు.

Read also:Telangana Elections 2023: ప్రచారంలో కౌశిక్‌రెడ్డి ఎమోషనల్ బ్లాక్‌మెయిల్.. విచారణకు ఈసీ ఆదేశం!

అతనికి ఆలోచించుకునే సమయం కూడా వాళ్ళు ఇవ్వ లేదు. వెంటనే ఫోన్ మాట్లాడుతున్న ఆ వ్యక్తి వెంకటేశ్వరరావు తో నౌపడా పోలీస్‌ స్టేషన్‌ ఎస్సైతో మాట్లాడాలంటూ కాన్ఫరెన్స్‌ కలిపాడు. కాన్ఫరెన్స్‌ లో మరో వ్యక్తి తన పేరు సందీప్‌రావు అని, తాను నౌపడా స్టేషన్‌ ఎస్సైని అంటూ.. మీ మీద దాదాపు 17 మంది మహిళలు ఫిర్యాదు చేసారని చెప్పాడు. దీనితో వెంకటేశ్వరరావు మరింత భయపడ్డారు. ఏం జరుగుతుందో అర్ధంకాని వెంకటేశ్వరరావు తాను ఏపీ మత్స శాఖలో జాయింట్‌ డైరెక్టర్‌నని తెలిపి.. నా 60 ఏళ్ళ జీవితంలో ఎప్పుడు ముంబయి వచ్చిందే లేదని.. అలాంటప్పుడు నేను ఎలా సిమ్ కార్డు కొని మహిళలకు అసభ్యకర సందేశాలు, ఫోన్లు ఎలా చేయగలను అని ప్రశించారు. అయితే ఎస్సై సందీప్‌రావు అంటూ మాట్లాడిన ఆ వ్యక్తి వెంకటేశ్వరరావు మాటలను పట్టించుకోలేదు. అంతేకాదు ఒకసారి సీబీఐ అధికారి మీతో మాట్లాడతారంటూ మరో వ్యక్తిని రంగంలోకి దించాడు. అతను తన పేరు ఆకాష్‌ కులహరి అని.. తాను సీబీఐ అధికారినంటూ ఫోన్‌లో స్కైప్‌ యాప్‌ ద్వారా పోలీస్‌ యూనిఫాంతో వీడియో కాల్ లో మాట్లాడాడు.

Read also:Tollywood: ఇస్మార్ట్ శంకర్-మాస్ కా దాస్ మధ్య బాక్సాఫీస్ ఫైట్…

ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావు హడలిపోయారు. కాగా సీబీఐ అధికారినంటూ పరిచయం చేసుకున్న వ్యక్తి ఈ కేసు విషయంలో కొంత నగదు డిపాజిట్‌ చేయాలని, కేసు పూర్తయిన తర్వాత తిరిగి తీసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా వాళ్ళు చెప్పిన ఖాతాలో రూ.7.60 లక్షలు డిపాజిట్‌ చేయాలని, నేషనల్‌ సీక్రెట్‌ లా మేరకు ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ చేయెప్పకూడదని.. చివరికి కుటుంబసభ్యులకు కూడా చెప్పకూడదని హెచ్చరించారు. అప్పటికే బెంబేలిత్తి పోతున్న వెంకటేశ్వరరావు సరేనని తన దగ్గర ఉన్న డబ్బులతో పాటుగా మరి కొంత అప్పు చేసి వాళ్ళు చెప్పిన ఖాతాలో వేశారు. డబ్బులు ఖాతాలో వేసినప్పటి నుండి తనకు కాల్ చేసిన వాళ్ళు తిరిగి మళ్ళీ కాల్ చెయ్యలేదు. ఆయన కాల్ చేసిన ఎవరు అందుబాటులో కి రాలేదు. ఈ క్రమంలో తాను మోసపోయినట్లు గ్రహించిన వెంకటేశ్వరరావు.. సోమవారం జిల్లా ఎస్పీ జాషువాకు ఫిర్యాదు చేసారు. ఈ క్రమంలో కేసు నమోదు చేయాల్సిందిగా జాషువా పెనమలూరు పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.