Site icon NTV Telugu

JC Prabhakar Reddy: రెండో రోజు ఈడీ ముందుకు జేసీ.. విషయం ఇదే..!

Jc

Jc

టీడీపీ సీనియ‌ర్ నేత‌, అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాక‌ర్ రెడ్డి… వరుసగా రెండోరోజూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరయ్యారు.. వాహనాల కొనుగోళ్ల కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డిని ప్రశ్నిస్తోంది ఈడీ.. గురువారం రోజు దాదాపు 9 గంటల పాటు ప్రభాకర్ రెడ్డిని ప్రశ్నించారు ఈడీ అధికారులు.. ఇవాళ బ్యాంకు ట్రాన్సాక్షన్స్ తీసుకొని ఈడీ కార్యాలయానికి వచ్చారు జేసీ.. కాగా, వాహ‌నాల అక్రమ రిజిస్ట్రేష‌న్లు చేయించార‌న్న కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది.. అయితే, ఈడీ విచారణపై కూడా తనదైన శైలిలో కామెంట్లు చేశారు జేసీ.. ఈడీ అధికారులు గొప్ప వాళ్లన్న ఆయన.. ఈడీ అధికారులు చిన్నవాళ్లేమీ కాదని.. ఈడీ అధికారుల గురించి ఎలా అంటే అలా మాట్లాడ‌రాద‌ని కూడా కామెంట్ చేశారు.

Read Also: 6 Airbags: కార్లలో ఎయిర్‌బ్యాగ్‌ రూల్స్.. కేంద్రానికి ఎదురుదెబ్బ..!

ఇక, విచారణ సందర్భంగా త‌న ప‌ట్ల ఈడీ అధికారులు చాలా గౌర‌వంగా వ్యవ‌హ‌రించారని పేర్కొన్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఈడీ అధికారుల గురించి బ‌య‌ట జ‌రుగుతున్న ప్రచారం తప్పంటూ కొట్టిపారేసిన ఆయన.. ఈడీ లాంటి ద‌ర్యాప్తు సంస్థ వ‌ద్ద మ‌న‌ల్ని మ‌నం నిరూపించుకునే అవ‌కాశం ఉంటుందని.. త‌న‌పై న‌మోదైన కేసులో ఈడీ అధికారుల వ‌ద్ద ఇప్పటికే అన్ని ఆధారాలు ఉన్నాయని.. వాటిలో త‌న త‌ప్పేం లేద‌ని నిరూపించుకుంటానని చెప్పుకొచ్చారు.. ఈ విష‌యంలో త‌న‌కు న‌మ్మకం ఉంది అంటూనే.. తనపై కేసు విషయంలో.. పరోక్షంగా సీఎంపై సెటైర్లు వేశారు.. మా రాజ్యంలో అధికారంలో ఉన్న వారు అనుకున్నది ఏదైనా జరుగుతుంది.. అయినా త‌న‌నేమీ చేయ‌లేక‌పోయారని వ్యాఖ్యానించారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.

Exit mobile version