JC Prabhakar Reddy: రెండో రోజు ఈడీ ముందుకు జేసీ.. విషయం ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ సీనియర్ నేత, అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి… వరుసగా రెండోరోజూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు.. వాహనాల కొనుగోళ్ల కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డిని ప్రశ్నిస్తోంది ఈడీ.. గురువారం రోజు దాదాపు 9 గంటల పాటు ప్రభాకర్ రెడ్డిని ప్రశ్నించారు ఈడీ అధికారులు.. ఇవాళ బ్యాంకు ట్రాన్సాక్షన్స్ తీసుకొని ఈడీ కార్యాలయానికి వచ్చారు జేసీ.. కాగా, వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించారన్న కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది.. అయితే, ఈడీ విచారణపై కూడా తనదైన శైలిలో కామెంట్లు చేశారు జేసీ.. ఈడీ అధికారులు గొప్ప వాళ్లన్న ఆయన.. ఈడీ అధికారులు చిన్నవాళ్లేమీ కాదని.. ఈడీ అధికారుల గురించి ఎలా అంటే అలా మాట్లాడరాదని కూడా కామెంట్ చేశారు.
Read Also: 6 Airbags: కార్లలో ఎయిర్‌బ్యాగ్ రూల్స్.. కేంద్రానికి ఎదురుదెబ్బ..!
Also Read
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
- Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. క్వింటాల్‌కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
ఇక, విచారణ సందర్భంగా తన పట్ల ఈడీ అధికారులు చాలా గౌరవంగా వ్యవహరించారని పేర్కొన్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఈడీ అధికారుల గురించి బయట జరుగుతున్న ప్రచారం తప్పంటూ కొట్టిపారేసిన ఆయన.. ఈడీ లాంటి దర్యాప్తు సంస్థ వద్ద మనల్ని మనం నిరూపించుకునే అవకాశం ఉంటుందని.. తనపై నమోదైన కేసులో ఈడీ అధికారుల వద్ద ఇప్పటికే అన్ని ఆధారాలు ఉన్నాయని.. వాటిలో తన తప్పేం లేదని నిరూపించుకుంటానని చెప్పుకొచ్చారు.. ఈ విషయంలో తనకు నమ్మకం ఉంది అంటూనే.. తనపై కేసు విషయంలో.. పరోక్షంగా సీఎంపై సెటైర్లు వేశారు.. మా రాజ్యంలో అధికారంలో ఉన్న వారు అనుకున్నది ఏదైనా జరుగుతుంది.. అయినా తననేమీ చేయలేకపోయారని వ్యాఖ్యానించారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.
తాజావార్తలు
-
SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్‌ల సమర్పణ.. 60 శాతం నమోదు..
-
AAA Vizag : వైజాగ్ AAA స్క్రీన్ స్పెసిఫికేషన్స్ వేరే లెవెల్ అంతే!
-
Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
-
Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
-
Vismaya Mohanlal : ఫస్ట్ సినిమాతో అదరగొట్టిన మోహన్ లాల్ కూతరు.. మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!