YSRCP vs Janasena: కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణాజిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.. గుడివాడలో రోడ్లకు మరమ్మత్తులు చేయాలంటూ కొడాలి నాని ఇంటి ముట్టడికి యత్నించారు జనసేన పార్టీ శ్రేణులు.. దీంతో, జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు.. ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోవడంతో.. కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. ఇక, జనసేన నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించగా.. తామేం నేరం చేశామంటూ ఎదురు తిరిగారు జనసైనికులు.. దీంతో, భారీగా పోలీసులను మోహరించారు.. గోతులమయంగా ఉన్న కొడాలి నాని ఇంటికి వెళ్లే ప్రధాన రహదారిలోనే ధర్నా నిర్వహించారు జనసేన కార్యకర్తలు. మొద్దు నిద్రపోతున్న సీఎం మేలుకోవాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ.. నినాదాలు చేశారు.. కొడాలి నాని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు నేర్పడం మాని అధ్వానంగ ఉన్న గుడివాడ రోడ్లకు మరమ్మతులు చేయించాలని హితవు పలికారు.
Read Also: Business Headlines 15-07-22: ఆల్ ఇన్ వన్ బిజినెస్ న్యూస్
Also Read
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
కాగా, ఓవైపు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును టార్గెట్ చేస్తూనే.. ప్రతీసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తావన తీసుకొస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈ మధ్య జరిగిన వైసీపీ ప్లీనరీ వేదికగానూ పవన్ కల్యాణ్‌పై హాట్ కామెంట్లు చేశారు కొడాలి నాని.. ఇలా ప్రతీసారి ఏ విషయంలోనైనా వైసీపీ వర్సెస్ జనసేనగా మారుతోంది. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది జనసేన పార్టీ.. #GoodMorningCMSir హాష్ ట్యాగ్‌తో.. ఏపీలోని రోడ్లకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తున్నారు జనసేన పార్టీ శ్రేణులు.. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లను బాగుచేయాలంటూ ఆందోళన నిర్వహిస్తున్నారు. జనసేన నిర్వహిస్తోన్న డిటిటల్ క్యాంపెయిన్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్సే వస్తుంది.. ఇప్పటికే 226 వేల ట్వీట్లతో #GoodMorningCMSir హాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!