Pawan Kalyan: నేడు జనసేన ఆవిర్భావ సభ.. మార్గదర్శకాలు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామ పరిధిలో నేడు జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు భారీ బహిరంగ జరగనుంది. ఈ సభ ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరై ప్రసంగించనున్నారు. సభకు హాజరయ్యే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కాగా 2024 ఎన్నికలకు జనసేన ఎలా ముందుకెళ్తుంది, ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారు అనే అంశాలపై ఈరోజు నిర్వహించే సభలో పవన్ కళ్యాణ్ వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సభకు హాజరయ్యే వారికి జనసేన పార్టీ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. టోల్ ప్లాజా సిబ్బందితో వివాదం పెట్టుకోవద్దు, ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దు, మద్యం సేవించి వాహనం నడపొద్దు, ద్విచక్రవాహనాలకు సైలెన్సర్లు తీసి రోడ్లపై నడిపించవద్దు, సభా స్థలిలో శాంతంగా ఉంటూ ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వాలి, చెట్లు, గోడలు, టవర్లు, స్పీకర్లపైకి ఎక్కకూడదు, విద్యుత్తు స్తంభాలకు దూరంగా ఉండాలి, పోలీసులు, అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి అంటూ జనసేన పార్టీ సూచించింది.
Also Read
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్‌పై పవన్ కీలక ఆదేశాలు
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు

తాజావార్తలు
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!