NTV Telugu Site icon

Polavaram Project: పోలవరంపై నేడు కీలక సమావేశం.. ఎవరి వాదన ఏంటి..?

Polavaram

Polavaram

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై ఇవాళ కీలక సమావేశం జరగనుంది… ఉదయం 11 గంటలకు వర్చువల్‌గా జరగనున్న ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు.. ఉన్నతాధికారులు హాజరుకాబోతున్నారు.. వారితో కేంద్రం ఈ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది… ఈ సమావేశానికి కేంద్ర జలసంఘం, డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ (డీడీఆర్‌పీ) అధికారులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా హాజరవుతారని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది… ఆయా రాష్ట్రాల నీటిపారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు, ఈఎన్‌సీలు, ఇతర సాంకేతిక సలహాదారులు కూడా పాల్గొనబోతున్నారు..

Read Also: Phd student: వైరల్‌గా మారిన పీహెచ్‌డీ విద్యార్థి చేసిన పని.. ఏం చేశాడంటే..?

ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఇతర రాష్ట్రాల అభ్యంతరాలపై చర్చ సాగనుంది.. డ్యాం నిర్మాణం, ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే.. అయితే, ఇతర రాష్ట్రాల అభ్యంతరాలపై కేంద్రం సమావేశం నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.. దీంతో.. ఇవాళ ఉదయం 11 గంటలకు వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసింది కేంద్ర జలశక్తి శాఖ.. ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి అధికారులతో పాటూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సీఎస్‌లు, ఉన్నతాధికారులు పాల్గొనబోతున్నారు.. ఈ సమావేశంలో ఎలాంటి చర్చ సాగనుంది.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. అనేది ఆసక్తికరంగా మారింది.

అయితే, పోలవరం ప్రాజెక్టును 50 లక్షల క్యూసెక్కుల వరద అంచనాతో డిజైన్‌ చేసినా.. 58 లక్షల క్యూసెక్కుల వదర వచ్చే అవకాశం ఉందని తెలంగాణ వాదనగా ఉండగా.. ఏపీ మాత్రం ఇది కొట్టిపారేస్తోంది.. గోదావరిలో వందేళ్లలో గరిష్టంగా వచ్చిన వదర 28.5 లక్షల క్యూసెక్కులు మాత్రమేననని.. ఆ మేరకు పోలవరం స్పిల్‌ వే నిర్మిస్తే సరిపోతుందంటున్నారు.. ఇక, తెలంగాణ వాదిస్తున్నట్లు పోలవరానికి 58 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశమే లేదంటోంది కేంద్ర జలశక్తి శాఖ.. పోలవరం బ్యాక్‌ వాటర్‌ ప్రభావంపై కేంద్ర జలసంఘం అధ్యయనం చేసి ముంపు సమస్య రాదని.. వచ్చే అవకాశం కూడా లేదని సాంకేతికంగా వెల్లడించింది అంటున్నారు.. కానీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మాత్రం కేంద్ర జలశక్తి ఇప్పటికే నిర్బంద్వంగా తిరస్కరించినా పోలవరం బ్యాక్‌ వాటర్‌ ప్రభావంపై ఉమ్మడి రీ సర్వే చేయాలని పట్టుబడుతున్నాయి.. దీంతో, ఇవాళ జరిగే సమావేశంలో ఎలాంటి చర్చ జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.