NTV Telugu Site icon

CM Jagan: ట్విట్టర్‌లో జగన్ సునామీ.. ఆసియాలో నాలుగో స్థానం.. ఓవరాల్‌గా ఐదోస్థానం

Jagan Birthday

Jagan Birthday

CM Jagan: ఏపీ సీఎం జగన్ జన్మదినం సందర్భంగా సోషల్ మీడియా మోతెక్కింది. ట్విట్టర్ వేదికగా ఆయన అభిమానులు, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సీఎం జగన్ అభిమానులు తమ అభిమాన నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ #HBDYSJagan అనే హ్యాష్ టాగ్‌తో 5 లక్షల 50 వేలకు పైగా ట్వీట్లతో 300 మిలియ‌న్స్‌కు పైగా రీచ్‌తో ట్రెండ్ చేశారు. డిసెంబ‌ర్ 20 సాయంత్రం 5 గంట‌ల‌కు ప్రారంభమైన ఈ ట్రెండ్ మొదలవగా సీఎం జగన్ అభిమానులు ట్వీట్ల సునామీతో దేశంతో పాటు ఆసియా ఖండంలో నాలుగో స్థానంలో నిలిచారు. ఈ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా ఐదో స్థానంలో నిలవడం విశేషం. ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ అభిమానుల జ‌న్మదిన శుభాకాంక్షల ట్వీట్ల ప్రవాహం నిరాటంకంగా కొనసాగడం దేశంలో మ‌రే ఇత‌ర నాయ‌కుడికి ఈ స్థాయిలో ట్రెండింగ్ జ‌ర‌గ‌లేదు.

Read Also: DL Ravindra Reddy: ఏపీ ప్రభుత్వంపై డీఎల్ రవీంద్రారెడ్డి విమర్శలు.. పార్టీ మారబోతున్నారా?

మరోవైపు సీఎం జగన్ జన్మదినం సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతో పాటు అన్నదానం, వస్త్రదానాలు చేశారు. అలాగే ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రెడ్ క్రాస్ సంస్థతో కలిసి రక్తదాన శిబిరాలను కూడా చేపట్టారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏపీ వ్యాప్తంగా సుమారు లక్ష 30 వేల మంది రక్తదానం చేయడంతో గిన్నిస్ రికార్డు కూడా సొంతమైంది. గతంలో 72వేల మంది రిజిస్ట్రేషన్‌లతో దక్షిణాఫ్రికా పేరుతో గిన్నిస్ రికార్డు ఉండేది. తాజాగా తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయం లక్షా 30 వేల రక్తదాన రిజిస్ట్రేషన్‌లు సాధించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించారు. ఇంకా ఈ రిజిస్ట్రేషన్‌లు పెరిగే అవకాశముందని తెలుస్తోంది. అటు తన బర్త్ డే సందర్భంగా తన నివాసంలో కుటుంబసభ్యుల కోసం కాసేపు జగన్ సమయం వెచ్చించారు.