Cm Jagan Mohan Reddy: ధర్మారెడ్డి, చెవిరెడ్డిలను పరామర్శించిన జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంత బిజీగా వున్నా.. ఇబ్బందుల్లో ఉన్నవారిని ఎలా ఆదుకోవాలో సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలిసినంతగా ఎవరికీ తెలియదంటారు. నంద్యాల, తిరుపతి జిల్లాల్లో జగన్ ఇవాళ పర్యటించారు. తుమ్మలగుంట, తిరుపతి జిల్లాలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు సీఎం వైఎస్ జగన్. టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళిరెడ్డి అలియాస్ శివ (28) ఆకస్మిక మరణం పొందడంతో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామానికి చేరుకున్న సీఎం వైయస్ జగన్ చంద్రమళిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ధర్మారెడ్డి, ఆయన సతీమణి, కుటుంబ సభ్యులు, బంధువులను సీఎం వైయస్ జగన్ పరామర్శించారు. ఓదార్చి ధైర్యం చెప్పారు.
గుండెపోటుతో చంద్రమౌళి మృతి
చెన్నైలో బీటెక్ పూర్తిచేసి ముంబైలో ఫైనాన్స్ కన్సల్టెంటుగా ఉద్యోగం చేస్తున్న ధర్మారెడ్డి తనయుడు చంద్రమౌళి ఈనెల 18వ తేదీన చెన్నైలో తన స్నేహితుడితో కలిసి కారులో వెళ్తున్న సమయంలో గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఆళ్వార్‌పేటలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రిలో చేరిన చంద్రమౌళికి ఎక్మో చికిత్స అందించిన ఫలితం దక్కలేదు. ధర్మారెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది. చంద్రమౌళి భౌతికకాయాన్ని ధర్మారెడ్డి స్వగ్రామం నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాలకు ప్రత్యేక అంబులెన్స్‌లో బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెన్నై నుంచి తరలించారు. ఇవాళ ఉదయం చంద్రమౌళి పార్ధివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. తీవ్ర విషాదంలో వున్న ధర్మారెడ్డి కుటుంబాన్ని ఓదార్చారు సీఎం జగన్. సీఎం వెంట టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఉన్నారు.
Also Read
- Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
- AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
- AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
- Heavy Rains: బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. నీట మునిగిన వందల ఎకరాల వరి పంట!
జయమ్మకు సీఎం భరోసా
టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన పారుమంచాల గ్రామానికి చెందిన మహిళ జయమ్మ, తన కుమారుడు యోగి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని, డయాలసిస్ చేయించుకుంటూ ఇబ్బందులు పడుతున్నట్లు సీఎంకి తన కుమారుడి అనారోగ్య సమస్య వివరించింది. అంతేకాక కుమారుడికి అవసరమైన వైద్య సహాయం, పెన్షన్ మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని అభ్యర్ధించింది. వెంటనే స్పందించిన సీఎం నంద్యాల జిల్లా కలెక్టర్‌కు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్ జయమ్మ కుటుంబానికి అవసరమైన సాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నారు.

- Tags
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!