NTV Telugu Site icon

Nandyala: అర్థరాత్రి అంతర్రాష్ట్ర దొంగల హల్చల్.. పోలీసుల ముప్పుతిప్పలు..!

Untitled 8

Untitled 8

Nandyala: రాష్ట్రంలో దొంగల భయం రోజురోజుకి ఎక్కువైపోతోంది. రాష్ట్రంలో ఉండే దొంగల ముఠాలు సరిపోనట్లు ప్రస్తుతం అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు పుట్టుకు వస్తున్నాయి. రాష్ట్రంలో ఉండే దొంగల పోరే పడలేకుంటే ఇపుడు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన దొంగలు రాష్ట్రంలో హల్చల్ చేస్తున్నారు. గత కొంత కాలంగా రాష్ట్రంలో దొంగతనాల కేసులు ఎక్కువయ్యాయి. ఈ నేపధ్యంలో మరోసారి అంతర్రాష్ట్ర దొంగలు చేతివాటం చూపేందుకు ప్రయత్నించారు. పట్టుకోవాలి అని ప్రత్నించిన పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఈ ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. నంద్యాల లోని రైల్వే స్టేషన్ రోడ్ గూడ్స్ షెడ్ ప్రాంతంలో అర్ధరాత్రి అంతర్రాష్ట్ర దొంగలు రెచ్చిపోయారు.

Read also:Balayya: బిగ్ బాస్ సీజన్ 8కి నట సింహం హోస్టింగ్?

ముగ్గురు అంతరాష్ట్ర దొంగలు ఓ ఇంట్లో ప్రవేశించి.. చేతివాటం చూపేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అలెర్ట్ అయిన స్థానికులు, ఇంటి యజమాని దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరు దొంగలు పరారైయ్యారు. అయితే మరో దొంగ మాత్రం తప్పించుకునేందుకు ఇంటి పైకప్పు పైకి ఎక్కారు. స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించగా దొంగ ఇనుప రాడ్డుతో బెదిరించారు. దీనితో ఇంటి యజమాని, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటీన ఘటన స్థలానికి వచ్చారు. దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులకు, ఫైర్ సిబ్బందికి దొంగ చుక్కలు చూపించారు . చివరకు పోలీసులు చాకచక్యంగా దొంగను పట్టుకున్నారు. అనంతరం పట్టుకున్న దొంగను 3 టౌన్ పీఎస్ కు తరలించారు.