నిత్యం వార్తల్లో ఉండే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భారీగా అంతర్గత బదిలీలు జరిగాయి. 170 మంది ఆలయ ఉద్యోగులను అంతర్గతంగా బదిలీలు చేశారు ఈఓ భ్రమరాంబ. ఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారీగా అంతర్గత బదిలీలకు ఉపక్రమించారు భ్రమరాంబ. వివిధ స్థాయిల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను అదే స్థానాల్లో కొనసాగిస్తున్నట్లు కొందరు ఉద్యోగుల ఆరోపించారు. 15 నుంచి 20 మందిని అదే పోస్టుల్లో కొనసాగించటంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వారిని కూడా బదిలీ చేయాలంటున్నారు మిగిలిన ఉద్యోగులు.
Read Also:IPL Auction 2023 Live Updates: షకీబ్‌ను కొనుగోలు చేసిన కోల్‌కతా
భ్రమరాంబ చేసిన బదిలీలపై ఉద్యోగుల్లో కలవరం ప్రారంభం అయింది. అటెండర్లు, స్వీపర్లు చేసే పోస్టుల్లో జూనియర్ అసిస్టెంట్లకి విధులు కేటాయించారంటూ ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. జూనియర్ అసిస్టెంట్లు పనిచేసే చోటులో రికార్డ్ అసిస్టెంట్స్, అటెండర్లకు విధులు వేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈవో భ్రమరాంబ చేసిన బదిలీలపై దేవాదాయ కమిషనరుకు ఫిర్యాదు చేయడానికి సిద్దమవుతున్నారు కొందరు ఉద్యోగులు. మరి ఈవో భ్రమరాంబ దీనిపై ఎలా ప్రతిస్పందిస్తారో చూడాలి మరి.
ఆ ఉంగరం కొట్టేసింది ఎవరంటే?
మరోవైపు కొందరు ఉద్యోగుల చేతివాటంపై విమర్శలు వస్తున్నాయి. దుర్గగుడిలో భక్తురాలు ఉంగరం కొట్టేసిన కొబ్బరి కాంట్రాక్ట్ ఉద్యోగిని కనిపెట్టారు. కొబ్బరికాయ కొట్టే సందర్భంలో జారిపోయింది భక్తురాలి ఉంగరం.. అక్కడే ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగిని తన ఉంగరం మిస్ అయిన సంగతి అడిగింది భక్తురాలు. అయితే, తనకేం తెలియదని బుకాయించాడు కాంట్రాక్ట్ ఉద్యోగి. అనుమానం వచ్చిన భక్తురాలు అధికారులకు ఫిర్యాదు చేసింది. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ చూసి.. కాంట్రాక్ట్ ఉద్యోగే ఉంగరాన్ని జేబులో వేసుకున్నట్టు గుర్తించారు సిబ్బంది. దీంతో ఆ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పజెప్పారు ఆలయ సిబ్బంది.
Read Also: Off The Record: రసవత్తరంగా యలమంచిలి పాలిటిక్స్