NTV Telugu Site icon

Andhra Pradesh: మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

Ysrcp

Ysrcp

Andhra Pradesh: ఇటీవల విశాఖలో మంత్రులపై దాడి ఘటన ఏపీలో పెనుదుమారం రేపింది. అయితే తాజాగా తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలలోని మంత్రులు, పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని అధికార పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి. అర్జీలు ఇచ్చే సాకుతో జనసేన కార్యకర్తలు దాడులు చేసే అవకాశముందని ఇంటెలిజెన్స్ విభాగం వార్నింగ్ ఇచ్చింది. టెక్కలిలో జనసేన కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి అలర్ట్ కావాలంటూ ఇంటెలిజెన్స్ హితవు పలికింది. స్థానికంగా కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో సర్కులేట్ అవుతోన్న అంశాలతో ఇంటెలిజెన్స్ వర్గాలు మంత్రులు, ఎమ్మెల్యేలను అప్రమత్తం చేశాయి.

Read Also: TOSS : విద్యార్థులకు శుభవార్త.. ఓపెన్ స్కూల్ అడ్మిషన్ డ్రైవ్

ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తం చేసిన మంత్రులు, ఎమ్మెల్యేల జాబితాలో మంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి అంబటి రాంబాబు, మంత్రి గుడివాడ అమర్నాథ్, మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రి రోజా, మంత్రి దాడిశెట్టి రాజా. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్, అవంతి శ్రీనివాస్, గ్రంథి శ్రీనివాస్, దువ్వాడ శ్రీనివాస్, జక్కంపూడి రాజా, పేర్ని నాని, కొడాలి నాని ఉన్నట్లు తెలుస్తోంది. కాగా చెప్పు చూపించి బయటపెడతామంటే ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరని పవన్‌ను ఉద్దేశించి మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. ఏ వ్యక్తి అయినా, ఏ నాయకుడు అయినా ఎదుటివారికి గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలని సూచించారు. అగౌరవంగా మాట్లాడితే సహించేదిలేదని మంత్రి బొత్స వార్నింగ్ ఇచ్చారు.

Show comments