NTV Telugu Site icon

Konaseema Riots: కోనసీమ అల్లర్ల కేసులో అమాయకులు బలి?

Konaseema Violence

Konaseema Violence

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన కోనసీమ అల్లర్ల కేసు లో అమాయకులు బలి అవుతున్నారా? తమ ఫెయిల్యూర్ లని కప్పి పుచ్చుకోవడానికి పోలీసులు దొరికిన వాళ్ళ పై కేసులు పెడుతున్నారా? అసలు ఊళ్ళో లేని వారి పై కేసులు ఎలా పెడతారు? వాటి గురించి పోలీసులు ఏమంటున్నారు? ఇప్పుడిదే కోనసీమలో హాట్ టాపిక్ అవుతోంది.

కోనసీమ జిల్లా కి అంబేద్కర్ పేరు పెట్టవద్దని ఈ నెల 20 న అమలాపురంలో భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.పోలీసులు కూడా ఊహించని స్థాయి లో జనం పోగయ్యారు.. వేల మంది ఒక్కసారిగా రావడంతో భారీ విధ్వంసం సృష్టించారు.. అయితే ఆ రోజు రాత్రి నుండి పోలీసులు కేసులపై దృష్టి పెట్టారు.. అరెస్టులు కేసులు అంటూ నిందితుల కోసం కుస్తీ పడుతున్నారు.. ఇప్పటి వరకు ఈ కేసులలో 46 మంది పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.19 మందిని అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ కేసులు విషయం లో పెద్ద గందరగోళం ఏర్పడింది. పోలీసులు హడావుడి కేసులతో అమాయకులు బలి అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

ఇతర పనులతో ఆ రోజు అమలాపురం వచ్చిన వారు కేసులలో బుక్ అయిన వారు ఉన్నారు. తమకేమి తెలియదు అని పోలీసులు చుట్టూ తిరుగుతున్న వారు ఉన్నారు..పోలీసులు మాత్రం అన్ని చట్ట పరంగా చేస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఎఫ్ ఐ ఆర్ ఫైనల్ కాదని మార్పులు చేర్పులు ఉంటాయని చెప్తున్నారు.. కానీ కేసులు నమోదు అయినవారు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. కేసులలో తమకు సంబంధం లేకుండా ఇరుక్కున్న వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.. తమకి ఈ కేసులు ఇబ్బంది పెడుతున్నాయని అంటున్నారు.. ఒక్క సారి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం వలన భవిష్యత్తు పోతుందని అంటున్నారు. పోలీసులు కేసులు నమోదు చేయాలనే అత్యుత్సాహం ఎక్కువ ఉందని వాపోతున్నారు.

కేసులు మరిన్ని నమోదు అవుతాయని పోలీసులు చెబుతున్నారు..తమ పేర్లు ఎక్కడ ఉంటాయో అని చాలా మంది టెన్షన్ పడుతున్నారు.. పోలీసులు ఇప్పటికే 350 సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. చాలా మంది ఆ రోజు రోడ్ల పైకి వచ్చి జరిగిన ఆందోళనలను చూశారు.. అటువంటి వారి ఫోటోలు సైతం పోలీసుల లిస్ట్ లో ఉన్నాయి. జిల్లా కేంద్రం కావడంతో హాస్పిటల్ ,మార్కెట్ పనులు కోసం వచ్చిన చాలా మంది ఈ గొడవలలో ఇరుక్కుపోయారు.. కొందరు ఒకే పేరు తో చాలా మంది వ్యక్తులు ఉంటారు. పొరపాటున పోలీసులు ఒకరికి బదులు ఒకరిని తీసుకువెళుతున్నారు.. దాంతో నానా హైరానా పడిపోతున్నారు..కొందరు ఫోన్ లు స్విచ్ ఆఫ్ చేసి కనీసం కుటుంబ సభ్యులకి కూడా అందుబాటులోకి రావడం లేదు. మొత్తానికి కోనసీమ అల్లర్ల కేసులతో పోలీసులు గందరగోళం సృష్టిస్తున్నారు.. చాలా మంది సంబంధం లేని వాళ్ళు ఇందులో ఇరుక్కుంటున్నారు. మరి ఖాకీలు కేసులు విషయంలో ఎటువంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.. అమాయకులను ఈ వివాదాల లోకి లాగకుండా చూడాల్సిన అవసరం ఉంది.

India-Bangladesh: రెండేళ్ల తరువాత ఇరు దేశాల మధ్య రైళ్లు ప్రారంభం