కరోనా మహమ్మారి దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చింది. గత రెండేళ్ల నుంచి గ్లోబల్ సప్లై చైన్ వ్యవస్థ దెబ్బతింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక, సేవా, వ్యవసాయ రంగాలపై ప్రభావం పడింది. ఇప్పటికీ శ్రీలంక వంటి దేశాలు కోవిడ్ కారణంగా తీవ్రంగా దెబ్బతింది. కరోనా కారణంగా ఎక్కడిక్కడ దేశాలు ఆంక్షలు, లాక్ డౌన్లు విధించుకున్నాయి. దీంతో ఇతర దేశాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఫ్లైట్స్, రైళ్లు రద్దు కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రెండేళ్ల క్రితం కోవిడ్ మహామ్మారి కారణంగా భారత్- బంగ్లాదేశ్ ల మధ్య రద్దైన రెండు రైళ్లను తిరిగి ప్రారంభించారు. ఆదివారం ఇరు దేశాల మధ్య రవాణాకు ఈ రైళ్ల ఎంతో కీలకం. నేటి నుంచి బంధన్ ఎక్స్ ప్రెస్, మైత్రీ ఎక్స్ ప్రెస్ లను తిరిగి ప్రారంభం అయ్యాయి. బంధన్ ఎక్స్ ప్రెస్ భారత్ నుంచి బయలుదేరి కోల్ కతా నుంచి బంగ్లాదేశ్ లోని ఖుల్నా చేరుకుని తిరిగి కోల్ కతా చేరుకుంటుంది. మైత్రీ ఎక్స్ ప్రెస్ కోల్ కతా నుంచి బయలుదేరి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకుని తిరిగి కోల్ కతాకు వస్తుంది.
బంగ్లాదేశ్ నుంచి ప్రయాణికులు ముఖ్యంగా పర్యాటక, వైద్యం, కొనుగోలు కోసం ఇండియా వస్తారు. దీంతో పాటు పశ్చిమ బెంగాల్ కు, బంగ్లాదేశ్ కు దేశ విభజనకు ముందు నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇరు దేశాల్లో బంధుమిత్రులు ఉన్నారు. తొలి రోజు బంధన్ ఎక్స్ ప్రెస్ లో కేవలం 19 మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించారు. మైత్రీ ఎక్స్ ప్రెస్ లో 100 మంది ప్రయాణికులు ప్రయాణించారు.