Site icon NTV Telugu

Weather Update: బంగాళాఖాతంలో వాయుగుండం.. భారీవర్షాలకు అవకాశం

Rains Alert

Rains Alert

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీ ప్రజలకు పలు వాతావరణ సూచనలు చేసింది. ఐఎండి సూచనల ప్రకారం వాయువ్య బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాల వెంబడి అల్పపీడనం కేంద్రీకృతం అయింది. ఇది వచ్చే 48 గంటల్లో అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం వుందని తెలిపింది. ఆ తరువాత ఒడిశా మరియు ఛత్తీస్‌గఢ్ మీదుగా క్రమంగా పశ్చిమ- వాయువ్య దిశగా కదిలే అవకాశం వుంది.

దీని ప్రభావంతో ఈరోజు ఉత్తరాంధ్రలో అక్కడడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. మిగిలిన చోట్ల అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం వుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళారాదని డా. బిఆర్ అంబేద్కర్
విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.

ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరంలో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఇప్పుడు వాయువ్యం& ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారింది. ఒడిశా మరియు ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ తీరం వద్ద ఉంది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుతో నైరుతి దిశగా వంగి ఉంది. వచ్చే 48 గంటల్లో తీవ్ర అల్పపీడనం ఒడిశా మరియు ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఋతుపవనాల ద్రోణి ఇప్పుడు సముద్ర మట్టం వద్ద జైసల్మేర్, నుండి వాయువ్య & ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై అల్పపీడన ప్రాంత కేంద్రం ఒడిశా మరియు ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ తీరం మరియు ఆగ్నేయ దిశగా ఉత్తర అండమాన్ సముద్రం వరకు ఉంది.

రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు అందచేసింది. తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. తెలంగాణా రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది రేపు, ఎల్లుండి భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ, అత్యంత భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అవకాశం ఉంది. ఈ రోజు, తెలంగాణా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షములు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు గాలి వేగం గంటకు 30 నుండి 40కిమీ వేగంతో కూడిన ఈదురు గాలులు తెలంగాణా రాష్ట్రంలో వీచే అవకాశం ఉంది.

Nithya Menen: నిత్యా గురించి ఆ విషయాలు తెలిసుంటే.. ప్రేమించే వాడినే కాదు

Exit mobile version