NTV Telugu Site icon

ఆనంద‌య్య క‌రోనా మందు.. హైకోర్టులో పిటిష‌న్‌

Anandaiah

క‌రోనా విజృంభిస్తోన్న స‌మ‌యంలో.. ఆనంద‌య్య క‌రోనా మందు పంపిణీ చేయ‌డం.. దానిపై పూర్తిస్థాయిలో అధ్య‌య‌నం చేప‌ట్ట‌డంతో.. మందు త‌యారీ, పంపిణీ ఆగిపోయాయి.. అయితే, చాలా మంది ఆనంద‌య్య‌కు స‌పోర్ట్ చేస్తున్నారు.. ప్ర‌భుత్వం వెంట‌నే ఆనంద‌య్య‌తో మందు పంపిణీ చేయించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.. మ‌రోవైపు.. ఆనందయ్య ఆయుర్వేద మందు కొనసాగించాలని కోరుతూ.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖ‌లు అయ్యింది… అనంత‌పురానికి చెందిన ఉమా మహేశ్వర నాయుడు అనే వ్య‌క్తి త‌ర‌పున పిటిష‌న్ దాఖ‌లు చేశారు న్యాయ‌వాది బాలాజీ.. నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నంలో.. కరోనా నివారణ కోసం ఆనందయ్య ఆయుర్వేద మందు ఇస్తున్నార‌ని పేర్కొన్న పిటిష‌న‌ర్.. ప్రభుత్వం ఈ మందు పంపిణీ నిలిపి వేసిందని, దీనిపై విచారణ జరపాల‌ని కోరారు.