Honey Parents Met CM YS Jagan Mohan Reddy In Camp Offie: అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హనీని సీఎం జగన్ ఆదుకున్న విషయం అందరికీ తెలిసిందే. కోనసీమ జిల్లాలో పర్యటించినప్పుడు.. హనీ తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబులు ఆయన్ను కలిసి, తమ చిన్నారి ఆరోగ్య పరిస్థితిని వివరించారు. హనీ ఆరోగ్యం గురించి తెలిసి చలించిపోయిన సీఎం.. వెంటనే ఆ చిన్నారి చికిత్స కోసం రూ.1 కోటి మంజూరు చేశారు. అంతేకాదు.. చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్లతో పాటు నెలకు రూ. 10 వేలు పెన్షన్ కూడా ప్రభుత్వం అందిస్తోంది. సీఎం జగన్ అందించిన ఈ సహాయం పుణ్యమా అని.. చిన్నారి హనీ ఇప్పుడు కోలుకుంటోంది. ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటోంది. ఈరోజు హనీ పుట్టినరోజు కావడంతో.. ఆమె తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబు క్యాంపు కార్యాలయానికి వెళ్లి, సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు తమ పాప చాలా ఆరోగ్యంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారి హనీని జగన్ ఆశీర్వదించారు.
Harish Rao : పదో తరగతి విద్యార్థులను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలి
కాగా.. అయోధ్యలంక గ్రామానికి చెందిన రాంబాబు, నాగలక్ష్మి దంపతుల కుమార్తె అయిన హనీకి పుట్టుకతోనే గాకర్స అనే వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి వచ్చిన వారిలో కాలేయం పనిచేయదు. ఈ అత్యంత అరుదైన వ్యాధితో దేశంలో మొత్తం 14 మంది బాధపడుతుండగా, ఏపీలో చిన్నారి హనీ తొలి బాధితురాలు. ఈ వ్యాధి చికిత్సకు లక్షల్లో ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో.. హనీ తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోలేదు. సరిగ్గా అప్పుడే గోదావరి వరద బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా సీఎం జగన్ కోనసీమకు వెళ్లారు. అక్కడ ఈ పాప తల్లిదండ్రులు కంటపడటంతో.. జగన్ తన కాన్వాయ్‌ని ఆపించి, తల్లి వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అప్పుడే ఆ చిన్నారి వైద్యానియ్యే ఖర్చు మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా విడుదల చేయాలని సీఎం ఆదేశించడం, ఇప్పుడు ఆ చిన్నారి కోలుకోవడం జరిగింది.