తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతల బృందం గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తోంది.. అయితే, నిన్న టీడీపీ నేతల పడవకు ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో మాజీ మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలు వరద నీటిలో పడిపోయినా.. సురక్షితంగా బయటపడ్డారు.. ఈ ప్రమాదం వెనుక కుట్ర ఉందా? అనే అనుమాలను కూడా వ్యక్తం అయ్యాయి.. వాటిపై సీరియస్‌గా స్పందించారు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనతి.. పడవ ప్రమాద ఘటనను టీడీపీ రాజకీయం చేస్తుందని విమర్శించిన ఆమె.. తెలుగుదేశం పార్టీ నేతలు అడిగితే ఈ ఘటనపై విచారణ జరిపించేందుకు సిద్ధంగా ఉన్నాం అన్నారు.
Read Also: Business Headlines: 60 వేల కోట్ల ఫండ్ రైజింగ్ చేయనున్న టాటా గ్రూప్ కంపెనీలు
ఇక, గోదావరి నదిలో 25 లక్షల 80 వేల క్యూసెక్కులు వరద ప్రవాహం ఉన్నప్పుడే ఏ ప్రమాదం జరగలేదు.. నీటి ప్రవాహం తగ్గిన తర్వాత చంద్రబాబు ఘటన జరిగింది అని గుర్తుచేశారు మంత్రి తానేటి వనతి.. ఈ ఘటనలో కుట్ర ఏమీలేదని స్పష్టం చేసిన ఆమె.. గోదావరిలో మునిగిపోయిన టీడీపీ నేతలను కాపాడింది మా ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలే అన్నారు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబువి బురద రాజకీయాలు అంటూ మండిపడ్డారు.. వరద సమాచారాన్ని ముందుగానే ప్రజలకు తెలియజేసి అప్రమత్తం చేశాం.. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు.. మరోవైపు, టీడీపీని వారి పార్టీ వారే విమర్శిస్తున్నారు.. మేం విమర్శించాల్సిన పనేలేదు.. టీడీపీ అంతర్గత తప్పిదాలను కప్పిపుచ్చడానికే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు హోంమంత్రి తానేటి వనతి.