Minister Anitha: ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు అనకాపల్లిలో చేదు అనుభవం ఎదురైంది. బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా నక్కపల్లి మండలం రాజయ్య పేట గ్రామస్తులు హోంమంత్రి అనిత కాన్వాయ్ ను అడ్డుకుని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బల్క్ డ్రగ్ పార్క్ పై రాజయ్యపేట ప్రజలను బయట వ్యక్తులు వచ్చి రెచ్చగొట్టారు అని ఆరోపించింది. మత్స్యకారులతో దయచేసి రాజకీయాలు చేయవద్దు అని కోరింది. పోలీసులు ఎవ్వరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వారి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను.. 16 రోజులుగా రాజయ్య పేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్క్ మీద ధర్నా జరుగుతోంది.. సమస్య పరిష్కారం కోసం రాజయ్య పేట రావాలని ప్రజలు కోరారు.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఇక్కడకు వచ్చాను.. రాజయ్య పేట గ్రామం టీడీపీ కంచుకోట.. 2014, 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీటీ ఇచ్చారు అని మంత్రి అనిత గుర్తు చేశారు.
Read Also: YouTube Premium Lite: ఇకపై యాడ్స్ కు బైబై.. YouTube Premium Lite భారత్ లో ప్రారంభం.. తక్కువ ధరకే
అయితే, 2024 ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం వర్చువల్ గా శంకుస్థాపన చేశారు అని హోంమంత్రి అనిత తెలిపింది. అప్పటి వైసీపీ నాయకులు పాలాభిషేకాలు చేశారు.. ఎన్డీయే ప్రభుత్వంలో మోడీ విశాఖలో మరల శంకుస్థాపన చేశారు.. హెటిరో కంపెనీ వలన రాజయ్య పేట గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు.. రాజయ్య పేట గ్రామస్తులు అన్ని పార్టీలు నాయకులు, ప్రజలతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పాను.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్తాను.. రాజయ్య పేట ప్రజల కోరిక మేరకు బల్క్ డ్రగ్ పార్క్ పనులు తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించింది.