విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ…కేంద్రానికి చివరి అవకాశం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టింది. తమకున్న 100 శాతం వాటాలను విక్రయించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం వలన ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని కేంద్రం చెబుతున్నది. అయితే, ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకోబోమని ఇప్పటికే ఉద్యోగ, కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి. ఇటు ఏపీ ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది. ఒకవైపు పార్లమెంట్‌లో ఈ విషయంపై చర్చించాలని పట్టుపడుతూనే, మరోవైపు ఏపీ హైకోర్టులో కేసును దాఖలు చేసింది.
Read: చిరంజీవి “లూసిఫర్” కోసం భారీ సెట్స్
Also Read
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్పై సంచలన వ్యాఖ్యలు
- Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
దీనిపై ఈరోజు విచారణ జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం విషయంలో దాఖలైన పిటీషన్‌పై కౌంటర్ దాఖలు చేయడంలో కేంద్రం తాత్సారం చేస్తుందని పిటీషనర్ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. అలాంటిది ఏమీ లేదని కేంద్రం కోర్టుకు సమాధానం చెప్పింది. కౌంటర్ దాఖలుకు సోమవారం వరకు గడువు ఇవ్వాలని కోరింది. ఇదే ఆఖరు అవకాశం అని కోర్టు కేంద్రానికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 2కి వాయిదా వేసింది హైకోర్టు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదని, ప్రైవేటీకరణ జరగకుండా ఆపే బాధ్యత తమదే అని ఏపీ బీజేపీ నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. అటు కేంద్రం మాత్రం ఎవరు చెప్పినా వినే సమస్యలేదు అన్నట్టుగా ఇప్పటికే చెప్పేసింది. ప్రైవేటీకరణ జరగకుండా ఏపీ బీజేపీ అడ్డుకుంటుందా..? చూడాలి.
తాజావార్తలు
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!