NTV Telugu Site icon

High Court: వైఎస్‌ వివేకా హత్య కేసు.. నిందితులకు బెయిల్‌ ఇవ్వొద్దు..!

Ys Viveka

Ys Viveka

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితులకు బెయిలుపై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది.. సీబీఐ, నిందితుల తరపున వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.. అయితే, సీబీఐ విచారణ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పాలని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది.. వివేకా హత్య కేసు వెనుక కుట్ర ఉందని తెలిపిన సీబీఐ.. జైలులో ఉండే నిందితులు సాక్ష్యులను బెదిరిస్తున్నారని వాదించింది..

Read Also: North Korea: ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌

మరోవైపు, నిందితులు 6 నెలల నుంచి జైలులోనే ఉన్నారని నిందితుల తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ఏ-4 కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌ మినహా వేరే సాక్ష్యం కూడా లేదని వాదించారు.. దేవిరెడ్డి శివశంకర రెడ్డి, గజ్జల ఉమామహేశ్వర రెడ్డి, సునీల్‌ యాదవ్‌లకు బెయిల్‌ ఇవ్వాలని హైకోర్టుకు విన్నవించారు న్యాయవాదులు.. ఆంక్షలు విధించైనా బెయిల్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.. ఇక, నిందితులు బయటకొస్తే సాక్ష్యులను బెదిరించే ప్రమాదం ఉందని సీబీఐ న్యాయవాది వాదించారు.. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. విచారణకు వారం పాటు వాయిదా వేసింది.