వివాదాలకు దూరంగా ఉండే అక్కినేని కుటుంబం చిక్కుల్లో పడింది. అక్కినేని ఫ్యామిలీకి చెందిన హీరో సుమంత్ గురువారం నాడు ప్రకాశం జిల్లా మార్కాపురం కోర్టుకు హాజరుకావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సుమంత్ హీరోగా గతంలో ‘నరుడా.. డోనరుడా’ సినిమాలో నటించాడు. ఈ మూవీకి సంబంధించి తనకిచ్చిన చెక్ బౌన్స్ అయిందని మార్కాపురం కోర్టులో ఫైనాన్షియర్ కారుమంచి శ్రీనివాసరావు కోర్టులో కేసు వేశాడు.
Read Also: వినోదం ఆశించే ప్రేక్షకులపై ఆంక్షలు సమంజసమా?
నరుడా.. డోనరుడా సినిమాకు నిర్మాతగా అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుప్రియ వ్యవహరించారు. ఈ మూవీకి కారుమంచి శ్రీనివాసరావు ఫైనాన్స్ అందించాడు. ఈ వ్యవహారంలో తనను హీరో సుమంత్, నిర్మాత సుప్రియ ఇద్దరూ మోసం చేశారని మార్కాపురం కోర్టులో శ్రీనివాసరావు కేసు వేశాడు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన వాయిదా కోసం హీరో సుమంత్‌తో పాటు నిర్మాత సుప్రియ గురువారం నాడు మార్కాపురం కోర్టుకు హాజరు కావడంతో ఈ ఇద్దరినీ చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు కోర్టు వద్దకు వచ్చారు.