NTV Telugu Site icon

Vidadala Rajini: వైద్య రంగంపై మాట్లాడే హక్కు చంద్రబాబుకి లేదు

Minister Vidadala Rajini

Minister Vidadala Rajini

ఏపీలో అధికార పార్టీ నేతలు.. విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకీ పెరిగిపోతోంది. మంత్రి విడదల రజిని మాజీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. అసలు వైద్యరంగం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వైద్య రంగంలో సంస్కరణలు తెచ్చారు…నాడు – నేడు కార్యక్రమం కింద రాష్ట్రంలోని ప్రతి హాస్పిటల్ రూపురేఖలు మార్చాం. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తెచ్చి దేశానికే ఆదర్శం అయ్యాం. ప్రభుత్వం వైద్య రంగం కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. క్షేత్రస్థాయిలో సేవలు ఎలా ఉన్నాయో చూడడానికి వచ్చాం అన్నారు.

Read Also: AP Highcourt: R5 జోన్ లో ఇళ్ల స్థలాల కేటాయింపు.. హైకోర్ట్ కీలక ఉత్తర్వులు

వైద్యం కోసం వచ్చే వారికి ఎక్కడ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాము.టీడీపీ హయాంలో ఒక్క డాక్టర్ ని కూడా నియమించలేదన్నారు మంత్రి విడదల రజనీ. వైద్య రంగాన్ని పూర్తిగా నీరుగాగార్చారు. వైద్య రంగానికి ఎంత మంచి చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి వైద్య రంగంపై మాట్లాడే హక్కు లేదన్నారు మంత్రి విడదల రజినీ.

Read Also: Teachers Unions: ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కామన్ బదిలీలు వద్దు

Show comments