NTV Telugu Site icon

Harirama Jogaiah: వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్‌కు హరిరామ జోగయ్య లేఖ

Harirama Jogaiah

Harirama Jogaiah

Harirama Jogaiah Wrote Letter To Pawan Kalyan On AP Volunteers Issue: తన వారాహి యాత్రలో భాగంగా ఏలూరు సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి.. ‘వాలంటీర్ వ్యవస్థ’ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఓవైపు పవన్ వ్యాఖ్యలను వాలంటీర్లు, వైసీపీ నేతలు ఖండిస్తుండగా.. మరోవైపు పవన్ వ్యాఖ్యల్ని కొందరు సమర్థిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థలోని లోపాల్ని ఎత్తిచూపుతున్నారు. ఇప్పుడు తాజాగా మాజీమంత్రి హరిరామ జోగయ్య వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్‌కు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన వాలంటీర్ల సమస్యల్ని ప్రవస్తావిస్తూ.. వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.

Pawan Kalyan: మచ్ వెయిటింగ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది ‘బ్రో’…

వాలంటీర్ వ్యవస్థ పేరుతో.. సుమారు రెండున్నర లక్షల మంది నెలకు రూ.5 వేల చాలీచాలని జీతంతో బ్రతుకుతున్నారని హరిరామ జోగయ్య ఆ లేఖలో తన ఆవేదన వ్యక్తం చేశారు. కనీస ఉపాధి కరువైన ఈ రోజుల్లో.. ప్రభుత్వం ఎంతమందికి ఉపాధి కల్పిస్తోందని ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థలో అధికశాతం వైసీపీ వారే ఉన్నారన్నది వాస్తవమని ఉద్ఘాటించారు. రాష్ట్ర ఎన్నికల మెమో 818 ప్రకారం.. వాలంటీర్ వ్యవస్థలో వైసీపీ వారు ఎక్కువగా ఉండటం వల్లే, ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ వ్యవస్థని ఉపసంహరించుకోవాలని జీవో ఇవ్వడం జరిగిందని అన్నారు. వాలంటీర్లను సంక్షేమ పథకాల అమలు కంటే.. అధికార పార్టీ తన ప్రయోజనం కోసమే ఎక్కువగా ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. అవసరమైతే వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాలన్న పవన్ సంకల్పం మంచిదేనని సమర్థించారు.

Jeevan Readdy: బీసీలకు ఆర్థిక సాయం చేయని ప్రభుత్వం తెలంగాణ లోనే ఉంది..

అయితే.. ఈ వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా రద్దు చేయడం కన్నా, కొన్ని ప్రతిపాదనలతో పునర్నిర్మించుకుంటే మంచిదని హరిరామ జోగయ్య తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. వాలంటీర్ వ్యవస్థలో ఉన్న రెండున్నర లక్షలమంది మహిళలకు వాలంటీర్ ఉద్యోగాలు కల్పించాలని ఆకాంక్షించారు. వాలంటీర్లకు కనీసం 10వ తరగతి విద్యార్హత ఉండాలని, వారికి కనీస వేతనం రూ.10 వేలు కేటాయించాలని కోరారు. జనాభా నిష్పత్తిలో కులాలకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఈడబ్ల్యూఎస్‌లో సంవత్సరానికి 8 లక్షల ఆదాయం మించని కుటుంబాలకే ఉద్యోగం అందాలన్నారు. జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన నియామక కమిటీలను ఏర్పాటు చేసి.. అర్హులైన వారికే ఉద్యోగ లబ్ధి కలిగించాలన్నారు. రాజకీయ పార్టీలకు చెందిన వారిని వాలంటీర్లుగా నియమించకూడదని డిమాండ్ చేశారు. అలాగే.. 21 నుండి 30 సంవత్సరాల లోపు వయసున్న వారే ఉద్యోగానికి అర్హులుగా నిర్ణయించాలన్నారు.