Harirama Jogaiah vs Amarnath: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన పొత్తు సంగతి ఏమోగానీ.. దీ సెంటర్ పాయింట్‌గా ఇద్దరు కాపు నేతల మధ్య లేఖల వార్ నడుస్తోంది.. ఇందులో ఒకరు వైసీపీ ప్రభుత్వం మంత్రి కాగా.. మరొకరు పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలనుకుంటున్న కీలక కాపు నేత హరిరామ జోగయ్య..వీరిద్దరూ పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి అనుకూలంగా, వ్యతిరేకంగా లేఖల యుద్ధం సాగిస్తున్నారు. తాజాగా, మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు మాజీ మంత్రి హరిరామజోగయ్య మరో లేఖ రాశారు.. కాపు సంక్షేమం కోరి కాపుసంక్షేమ సేన స్థాపించాను.. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనేది తన మొదటి లక్ష్యంగా పేర్కొన్నారు.. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం మరో లక్ష్యంగా రాసుకొచ్చిన హరిరామ జోగయ్య.. అనేక సంవత్సరాల నుంచి రాష్ట్రంలో రెండు కులాలు అధికారాన్ని చేజిక్కించుకుంటున్నాయని విమర్శించారు.. ఒకరిని మించిన సంక్షేమం మరోకరు చేయడం కష్టమేమి కాదన్న ఆయన.. నన్నురెచ్చగొట్టి లాభపడే ప్రయత్నం చేయకు అంటూ మంత్రి అమర్నాథ్‌కు రాసిన లేఖలో ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరిరామజోగయ్య.
Read Also: AP 3 Capitals: మూడు రాజధానులపై నిర్ణయం.. ఎక్కడ ఉండాలో మా ఇష్టం..!
కాగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్న వైసీపీ మంత్రులపై హరిరామజోగయ్య చేస్తున్న వార్ తో ఈ వ్యవహారం మరింత ముదురుతోంది. ముఖ్యంగా పవన్ కు అండగా నిలుస్తున్న కాపు నేత హరిరామజోగయ్యను టార్గెట్ చేస్తూ ఆయనకు మంత్రి గుడివాడ అమర్నాథ్ రాస్తున్న లేఖలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా కాపుల శత్రువు అయిన చంద్రబాబుకు పవన్ మద్దతెలా ఇస్తారంటూ అమర్నాథ్ హరిరామజోగయ్యను ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆయన కూడా ఘాటుగా బదులిస్తున్నారు. ఇలా ఇద్దరు నేతల మధ్య లేఖల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. మరి, ఈ లేఖల పరంపరకు ఎప్పుడు పులిస్టాప్ పడుతుందో చూడాలి.