Ambati Rambabu: ఢిల్లీలో పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తారని చెప్పారు.. కొన్ని నిర్ణయాలు వస్తాయని అందరూ ఎదురు చూశారు.. ఈ సమావేశంలో అసలు ఏ ధమైన చర్చ జరగలేదు అని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సీఎంల సమావేశంలో బనకచర్లపై అసలు ప్రస్తావనే లేదు.. వాళ్ళ పత్రికల్లోనే ఏపీలో ఒక రకంగా, తెలంగాణలో మరో రకంగా వచ్చింది.. చంద్రబాబు ఇష్టాగోష్టిగా మాట్లాడి బయటకు వచ్చాక ఉభయ రాష్ట్రాలు నాకు సమానమే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.. ఇరిగేషన్ మంత్రి రామానాయుడు కార్యాచరణకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తామన్నారు.. వాళ్ళ మాటలు వింటుంటే సీఎం చంద్రబాబు మోసపు మాటలు చెబుతున్నారు అనకతప్పదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది 7- 7- 24న ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు.. విభజన సమస్యల పరిష్కారం కోసం భేటీ అయ్యామన్నారు.. త్వరలో కమిటీ వేసి తేల్చేస్తామన్నారు.. ఇప్పటికి ఏడాది దాటింది.. మీరు సాధించింది ఏంటి అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
ఇక, నీళ్లను రాయలసీమకు తీసుకెళ్లి సస్యశ్యామల చేద్దామన్న ఆలోచన చంద్రబాబు లేదని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ప్రాజెక్టులు తప్ప మీరు చేసిందేమీ లేదు.. పోలవరం నుంచి బనకచర్లకు నీళ్లు తీసుకు వెళ్లాంటే 42 లెవెల్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది.. ఇవాళ దాన్ని 41.15 కే చంద్రబాబు అంగీకరించారు.. ఇప్పుడు పోలవరం, బనకచర్లకి 42 నుంచి నీళ్లు ఎలా తీసుకువెళతారు అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2027 వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు.. అక్కడ పనులు మాత్రం ముందుకు వెళ్ళడం లేదు.. డయాఫ్రమ్ వాల్ చాలా ప్రధానమైంది.. 0.65 వెడల్పుతో వేయాల్సిన డయాఫ్రమ్ వాల్ 0.9 వెడల్పు లో వేస్తున్నారు.. ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రవర్తన సరినది కాదు.. ఆయనకు పోలవరం మీద అసలు ఇంట్రెస్ట్ లేదు.. ఆయన దృష్టి మొత్తం మొబలైజేషన్ ఫండ్ మీదే ఉందని మాజీ మంత్రి రాంబాబు ఆరోపించారు.
