Pemmasani Chandrasekhar: సెప్టెంబర్ నుంచి అమరావతి పనులు క్లియర్ గా కనిపిస్తాయన్నారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. 40 నుంచి 50 వేల కోట్ల రూపాయల పనులు త్వరలో జరగబోతున్నాయన్నారు.. గత 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారన్న ఆయన.. రెండు మూడు సంవత్సరాల్లో మంచి నగరాన్ని చూస్తారని తెలిపారు.. చిన్న సమస్యలను ఉంటే వాటిని మేం పరిష్కరిస్తాం.. ఏ రాష్టానికి లేని సంస్థలు, ఉద్యోగాలు ఏపీకి మూడు, నాలుగు సంవత్సరాల్లో రాబోతున్నాయి.. మనకంటే అద్భుతమైనటువంటి తెలంగాణలో కూడా ఎటువంటి సానుకూలత లేదు.. నిరంతరం చంద్రబాబు, లోకేష్ ఢిల్లీ వెళ్లే నిధులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు.. అభివృద్ధి సంక్షేమానికి బ్రాండ్ ఇమేజ్ ఉన్న చంద్రబాబుతోనే సాధ్యం అన్నారు..
Read Also: Cheapest Phones: దేశంలోనే అత్యంత చౌకైన ఫోన్లు ఇవే!.. ధర రూ. వెయ్యి కన్నా తక్కువే..
ఇక, జగన్ మళ్లీ వచ్చి ఉంటే ఈ రాష్ట్రం ఊహకు కూడా అందకుండా ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు పెమ్మసాని.. గుంతల రోడ్లను బాగు చేసి, మద్యం రేట్లు తగ్గించారు.. పెండింగ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ బిల్లులను క్లియర్ చేశారు.. గుంటూరులో దాదాపు ఏడు ఆర్వోబీలు తీసుకొచ్చాం.. గుంటూరుకు ESI హాస్పిటల్, ఆయుష్ ఆయుర్వేద హాస్పిటల్ వస్తుందన్నారు. రాష్ట్రంలో శిలాఫలకాలాన్ని టీడీపీ హయంలో ఉన్నవే, వైసీపీ హయాంలో శిలాఫలకాలు ఎక్కడా కనిపించవు అని దుయ్యబట్టారు.. ఓపికగా ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలి, సహకరించకపోతే ప్రజలు నష్టపోతారని పేర్కొన్నారు.. ఏపీలో ఎక్కడైనా అద్భుతమైన అభివృద్ధి జరిగిందంటే అది మొదట గుంటూరు ప్రాంతంలోనే జరుగుతుందని వెల్లడించారు.
Read Also: Cinema Chettu: 300 సినిమాల చరిత్రకు మళ్లీ ఊపిరి..! గోదావరి గట్టున సినిమా చెట్టుకు పునరుజ్జీవం..
ఎవరిపైనా ఆధారపడకుండా ఉండాలనే అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సగభాగం పెట్టారని గుర్తుచేశారు కేంద్రమంత్రి పెమ్మసాని.. మహిళాశక్తిని మహా శక్తిగా గురించిన వ్యక్తి సీఎం చంద్రబాబు.. ఎవరికి తెలియని రోజుల్లో డ్వాక్రా గ్రూపులు పెట్టి, కాళ్లపై నిలబడాలని ఐటీ విప్లవం తీసుకొచ్చారు.. భారత దేశంలో ప్రతిష్టను పెంచే విధంగా చేసిన వ్యక్తి చంద్రబాబు.. రాజకీయాల్లో మహిళలు రాణించాలని 33శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు అవకాశం కల్పించారు అని ప్రశంసలు కురిపించారు. గడచిన 5 ఏళ్లలో ఏమైందో ప్రజలందరూ చూశారు.. రెండు వేల కోట్లతో స్త్రీ శక్తి పథకం ప్రవేశ పెట్టారు.. ప్రతి ఏటా 60 వేల కోట్లు సంక్షేమ పథకాలకు రాష్ట్ర బడ్జెట్ వెళ్లిపోతుంది.. కష్టాల్లో ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం సహకారంతో అన్ని జరుగుతున్నాయి.. 16 వేల డీఎస్సీ ఉద్యోగాలు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుంది.. భారం పెరుగుతున్నా సంక్షేమాన్ని ఏమాత్రం తగ్గించకుండా, అదేవిధంగా అభివృద్ధిని ఎక్కడలేని విధంగా ఏపీలో తీసుకొస్తున్నారని తెలిపారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్..
