Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy: ఏపీలో వ్యవస్థలు గాడి తప్పాయి.. ప్రధాని, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తాం..!

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy: ఏపీలో వ్యవస్థలు గాడి తప్పాయి.. రాష్ట్రంలో జరుగుతోన్న క్రైమ్‌, ప్రస్తుత పరిస్థితిన ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్తాం అన్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను గుంటూరు రమేష్ హాస్పిటల్‌లో వైసీపీ నేతలతో కలిసి పరామర్శించనున్న సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ఏర్పాటై ఏడాది అయ్యింది. ఎన్నికలకు‌ముందు మా పాలన డిఫరెంట్ గా ఉంటుందన్నారు. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. పోలీసు వ్యవస్థను ప్రైవేటు ఆర్మీలా తయారు చేసి ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారు.. తప్పుడు కేసులు పెడుతున్నారు.. రోజూ పది తప్పుడు కేసులు పెడుతున్నారంటూ విమర్శించారు.

Read Also: BJP New President: నెలాఖరులోగా బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు..!

అరాచక శక్తులు, గూండాలు చేసే పనులు వీళ్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ఆర్గనైజ్డ్ గా క్రైం చేస్తున్నారు. క్రిమినల్ గ్యాంగ్ కు యూనిఫారం వేసినట్లుంది ఈ వ్యవహారం అంటూ సంచలన ఆరోపణలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇక, లక్ష్మీనారాయణ ఏ పార్టీ అన్నది కాదు.. కులాన్ని తీసుకొచ్చారు. అసలు డీఎస్పీకి సివిల్ మ్యాటర్ లో ఏం పని..? అని ప్రశ్నించారు.. ఫ్రెండ్లీ పోలీస్ మరిచి యాభై ఏళ్లక్రితం ఎమర్జెన్సీకి తీసుకెళ్తున్నారని విమర్శించారు. రక్షించాల్సిన వారే అరాచక శక్తి అయితే ఎవరు ఏం చెయ్యగలరు..? అని ఆవేదన వ్యక్తం చేశారు.. శాతవసహన కాలేజీని అర్ధరాత్రి కూలగొట్టాల్సిన అవసరం ఏంటి..? దీని వెనుక టీడీపీ నేత ఉన్నారన్న ఆయన.. సంఘవిద్రోహక శక్తుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. నిజాయితీ ఉన్న పోలీసులు లూప్ లైన్ లో ఉన్నారు. వ్యవస్థ గాడి తప్పింది.. అయినా, ఒక్కరిపై చర్యలు లేవు.. పోలీసులే పంచాయతి చేస్తారు… శిక్షలు కూడా వాళ్లే వేస్తారు అంటూ మండిపడ్డారు.

Read Also: Minister Savita: మంత్రి గారికి కోపం వచ్చింది.. బొకే విసిరికొట్టింది..!

మరణవాంగ్మూలం కంటే ఏది ఎక్కువ కాదు.. లక్ష్మీనారాయణ స్వయంగా పోలీసుల వేధింపుల గురించి చెప్పారు.. కృష్ణవేణి, సుధారాణిలను‌ వేధించారు. ఆర్గనైజ్డ్ అరాచకానికి చట్టాన్ని కాపాడే పోలీసులను అడ్డం పెట్టుకున్నారు.. ఇంత కన్నా దిగజారేది లేదు అంటూ ఫైర్‌ అయ్యారు సజ్జల.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లు పరిస్థితి గమనించాలి.. అదుపుతప్పుతున్న వ్యవస్థలు రేపు మరింత డేంజర్ అవుతాయని హెచ్చరించారు. లక్ష్మీనారాయణ ఘటపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలి.. తప్పులకు పాల్పడుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.. తప్పుడు కేసులు, వేధింపులపై కోర్టులు, మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తాం అన్నారు.. ఇక, ప్రధాని మోడీ, రాష్ట్రపతి దృష్టికి రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు తీసుకెళ్తాం అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి..

Exit mobile version