Site icon NTV Telugu

Ambati Rambabu: ఆంబోతులంటూ మాపై చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదు..

Ambati Rambabu

Ambati Rambabu

చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు బ్రోకర్‌ రాజకీయాలు చేసి ఎదిగారని విమర్శించారు. రా..కదలి రా.. అంటే రావడం లేదు. ఆంబోతులంటూ తమపై చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదని మంత్రి అంబటి అన్నారు. చంద్రబాబు స్థాయి తగ్గించుకొని మాట్లాడుతున్నాడు.. తాను అలాగే మాట్లాడగలనని తెలిపారు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరమని పేర్కొన్నారు.

Hardik Pandya: మాల్దీవుల వివాదంపై స్పందించిన హర్దిక్ పాండ్యా.. ‘‘ తర్వాతి హాలిడే లక్షదీవుల్లోనే’’

చంద్రబాబుది ఆంబోతులకు ఆవులను సప్లై చేసే చరిత్ర అని మంత్రి అంబటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రతిఫలం అనుభవిస్తాడని తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా ఒకరితో.. పరోక్షంగా ఒకరితో పెట్టుకుంటున్నాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో జీవితాలు పంచుకోవడం పవన్ కళ్యాణ్ కి అలవాటేనని మంత్రి విమర్శించారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఎంతమంది ఏకమైన వల్ల గాని పని అని అన్నారు.

Ambati Rayudu: వైసీపీని వీడటంపై క్రికెటర్ అంబటి వివరణ

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 98% అమలుపరిచిన చరిత్ర జగన్ ది అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. చంద్రబాబుకు వచ్చేది 160 సీట్లు కాదు.. బీపీ 200 వస్తుందని విమర్శలు గుప్పించారు. కుప్పంలో కూరగాయలు ఎక్స్పోర్ట్ కి ఎయిర్పోర్ట్ కడతాను అన్న పెద్దమనిషి.. 14 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేశాడు…. కుంటి గుర్రాలకు పళ్ళు తోమారా అని దుయ్యబట్టారు. ఇన్నాళ్లు కుప్పంలో ఇల్లు లేని చంద్రబాబుకు ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలని స్పృహ వచ్చింది.. అది కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తు చేస్తేనే వచ్చిందని మంత్రి అంబటి విమర్శించారు.

Exit mobile version