Site icon NTV Telugu

Jogi Ramesh: బాలయ్య వ్యాఖ్యలపై జోగి రమేష్ కౌంటర్‌ ఎటాక్..

Jogi Ramesh

Jogi Ramesh

Jogi Ramesh: అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై కామినేని శ్రీనివాస్‌ ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు.. గుంటూరు జిల్లా జైల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ తారక్ ప్రతాపరెడ్డిని ములాఖత్ లో పరామర్శించిన మాజీ మంత్రి జోగి రమేష్, గుంటూరు వైసీపీ నేత నూరి ఫాతిమా.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జోగి రమేష్.. అసెంబ్లీ అంటే పవిత్ర దేవాలయం.. అలాంటి అసెంబ్లీలోకి మెన్షన్ హౌస్ తీసుకొని రావచ్చా? అని ప్రశ్నించారు.. అసలు, బాలకృష్ణ నందమూరి వారసుడా..? నారావారి వారసుడా..? అని ప్రశ్నించారు.. నందమూరి వారసుడైతే ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు కావాలి అని సవాల్‌ చేశారు.. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు అధ్యక్షుడు కాబట్టి బాలకృష్ణ ఎన్టీఆర్ వారసుడు కాదు అని ఎద్దేవా చేశారు.. బాలకృష్ణ.. చంద్రబాబుకి ఎప్పుడో తొత్తుగా మారాడు అని విమర్శించారు జోగి రమేష్‌..

Read Also: Trump: ట్రంప్‌తో షరీఫ్, మునీర్ 90 నిమిషాలు రహస్య చర్చలు.. వాటిపైనే చర్చ!?

ఇక, కూటమి ప్రభుత్వం భావ స్వేచ్ఛ హక్కును హరిస్తోందని ఆరోపించారు జోగి రమేష్.. సోషల్ మీడియాలో యూరియా కొరతపై పోస్ట్ పెడితే సోషల్ మీడియా యాక్టివిస్ట్ తారక్ ను అరెస్ట్ చేశారని మండిపడ్డారు.. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడితే.. కూటమి ప్రభుత్వం వాటిని అమ్మేస్తుందని విమర్శించారు.. కూటమి ప్రభుత్వం అరాచకాలన్నీ డిజిటల్ బుక్కులోకెక్కుతాయి.. మేం అధికారంలోకి రాగానే ఎవరైతే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో వారిని వదలం అంటూ హెచ్చరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని..

Exit mobile version