మాజీ మంత్రి మేరుగ నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. ఎవరో ఒక మహిళ తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో తనపై ఫిర్యాదు చేసిందని.. తాను ఆమెను శారీరకంగా లోబర్చుకుని, రూ. 90 లక్షలు తీసుకున్నానని ఆరోపిస్తుందని అన్నారు. తాను ఏ పరీక్షకైనా సిద్ధం అని తెలిపారు. రాజకీయాలలో ఎదుగుతూ ఉన్న ఒక దళితుడిని, పేదవాడిని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో తన తప్పు ఉందని తేలితే ఉరి శిక్షకైనా సిద్ధమని పేర్కొన్నారు. తనపై కోపం ఉంటే చంపండి.. అంతేగానీ ఇలాంటి దుష్ప్రచారం చేయకండని ఆయన సూచించారు.
Read Also: Congress: హర్యానా ఫలితాలపై తీవ్ర అసంతృప్తి.. ఈసీపై చట్టపరమైన చర్యలకు వెనకాడబోమని హెచ్చరిక
కుట్ర ప్రకారం ఇలాంటి ఫిర్యాదులు చేస్తున్నారు.. తాను మంత్రిగా ఉన్నప్పుడు అనేక మంది కలిసి ఉంటారు.. కానీ వ్యక్తిగతంగా ఎవరితో పరిచయం లేదని మేరుగ నాగార్జున తెలిపారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తా.. ఏ ఆధారంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టబోతున్నారు.. తాను దేనికైనా సిద్ధమని అన్నారు. ఆధారాలు లేని అసత్య ఆరోపణలు చేస్తే ప్రైవేట్ కేసులు పెడతానని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంపై పోలీసులు నిజాయితీగా దర్యాప్తు చేయాలని అన్నారు.
Read Also: IND vs NZ: తడబడ్డ టీమిండియా బ్యాటర్లు.. మొదటిరోజు ఆట ముగిసే సరికి
కాగా.. మేరుగ నాగార్జునపై గుంటూరు జిల్లాలో కేసు నమోదైంది. విజయవాడకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో తాడేపల్లి పోలీసులు కేసును నమోదు చేశారు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. 90 లక్షలు తీసుకొని మోసం చేశారని ఆరోపిస్తూ తాడేపల్లి సీఐ కల్యాణ్‌రాజ్‌కు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. తన వద్ద తీసుకున్న డబ్బులను తనకు తిరిగి ఇవ్వాలని మాజీ మంత్రిని అడిగితే బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాగైనా న్యాయం చేయాలని, మేరుగ నాగార్జున తనకు ఇవ్వాల్సిన రూ. 90లక్షలను తనకు ఇప్పించాలని పోలీసులను ఆ మహిళ కోరారు.