Guntur: కలెక్టర్ గ్రీవెన్స్‌కు ఎనిమిదేళ్ల బాలుడు.. ఎందుకో తెలిస్తే ఔరా! అనాల్సిందే..
- గుంటూరు కలెక్టర్ గ్రీవెన్స్ కి 8 ఏళ్ల బాలుడు..
- జీజీహెచ్ దగ్గర మూతపడిన తన తల్లి టిఫిన్ బండిపై ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur: సాధారణంగా కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌కు ఆ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వారి సమస్యలపై విన్నవించుకోవడానికి వస్తుంటారు.. కలెక్టర్ చొరవతో కొన్ని వెంటనే పరిష్కారం అయ్యే సమస్యలు ఉంటే.. కొన్ని టైం తీసుకునే సమస్యలు కూడా ఉంటాయి.. అయితే, ఈ రోజు గుంటూరు కలెక్టర్ గ్రీవెన్స్ లో ఓ ఎనిమిదేళ్ల బాలుడు ప్రత్యక్షమయ్యారు.. స్కూల్ బ్యాగ్ వేసుకునని.. చేతిలో ఓ ఫిర్యాదు పేపర్ పట్టుకుని కలెక్టరేట్లో నిర్వహిస్తోన్న గ్రీవెన్స్‌కు వచ్చాడు.. అయితే, ఆ బాలుడిని చూసి అంతా షాక్ అయ్యారు.. ఆ బుడతడికి వచ్చిన కష్టమేంటి? కలెక్టర్ దగ్గరకు ఎందుకు వచ్చాడు అనే రకరకాల ప్రశ్నలు వారి బుర్రల్లో మెదిలాయి..
Read Also: J-K: పహల్గాం తరహాలో భారీ ప్లాన్..? భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదుల యత్నం..
Also Read
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
- Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
అయితే, ఆ బాలుడు వచ్చింది.. తన సమస్యపై కాదు.. తన తల్లి సమస్యపై.. రోడ్డుపై చిన్న వ్యాపారం చేసుకునే తన తల్లికి కష్టం వచ్చింది.. ఇది ఆ బాలుడిని ఎంతో కలచివేసింది.. దీంతో, ఏకంగా కలెక్టర్ దృష్టికి ఆ సమస్యను తీసుకొచ్చాడు.. విషయం ఏంటంటే..? గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీచ్) వద్ద తన తల్లి టిఫిన్ బండి నిర్వహించింది.. అయితే, అధికారులు.. ఆ టిఫిన్ బండిని మూయించారు.. దీంతో మనస్థాపానికి గురైంది ఆ తల్లి.. పొట్ట నింపే టిఫిన్ బండి మూతపడడంతో.. ఏం చేయాలో తోచని పరిస్థితిలోకి వెళ్లిపోయింది.. అయితే, తల్లి ప్రవర్తనలో మార్పు గమనించిన ఆ బాలుడు.. తల్లి ఆవేదన చూడలేక కలెక్టర్ కలిసేందుకు వచ్చాడు.. నాలుగో క్లాస్ చదువుతోన్న బాలుడు యశ్వంత్… ఇక, యశ్వంత్ సమస్యను విన్న కలెక్టర్ నాగలక్ష్మి.. వెంటనే బాలుడి తల్లి టిఫిన్ బండి పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.. కలెక్టర్ స్పందనపై ఆనందం వ్యక్తం చేస్తూ ఆ బాలుడు తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.. తల్లి ఆవేదన చూసి.. కలెక్టర్ దగ్గరకు వచ్చిన ఆ బాలుడి ధైర్యాన్ని చూసి.. అంతా ఔరా! అంటున్నారు..
తాజావార్తలు
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..