Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్‌.. ఇంకో కేసులో 14 రోజుల రిమాండ్‌..

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో కేసులో షాక్‌ తగిలింది.. మెడికల్ కాలేజీని పీపీపీ విధానంలో నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనకు సంబంధించిన కేసులో అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో వాదనలు విన్న అనంతరం స్పెషల్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును దూషించిన కేసులో ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును పీటీ వారెంట్‌పై పట్టాభిపురం పోలీసులు గుంటూరు కోర్టుకు హాజరుపరిచారు. అయితే, ఈ కేసులోనూ ఆయనకు ఎదురుదెబ్బ తగలింది.. మెడికల్ కాలేజీ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.. ఇక మరోవైపు, గుంటూరు మొబైల్ కోర్టులో అంబటి రాంబాబు కస్టడీ పిటిషన్‌తో పాటు బెయిల్ పిటిషన్‌పై కూడా విచారణ కొనసాగుతోంది. ఈ విచారణ అనంతరం అంబటి రాంబాబును తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Read Also: CM Chandrababu Delhi Visit: మరోసారి హస్తినకు సీఎం చంద్రబాబు.. అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌ సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ