NTV Telugu Site icon

Ambati Rambabu: జగన్ తిరుమల పర్యటన రద్దుకు ప్రభుత్వమే కారణం..

Ambati

Ambati

Ambati Rambabu: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్.. తిరుమల పర్యటన వాయిదా పడటానికి ప్రభుత్వమే కారణం అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. వైఎస్‌ జగన్ తిరుమల పర్యటన వాయిదా పడటంపై స్పందించిన ఆయన.. దీనికి ప్రభుత్వమే కారణం అన్నారు.. నిన్న తిరుమలలో ఉన్న వాతావరణం ప్రజలందరూ గమనించారు.. జగన్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు నోటీసులు ఇచ్చారు.. అన్యమతస్తులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలని బోర్డులు పెట్టారు.. జగన్ పర్యటన రద్దు అవగానే బోర్డులు తీసేశారని విమర్శించారు.. ఇది వైఎస్‌ జగన్ పై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర.. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగాగా ఉన్నప్పుడు జగన్ తిరుమల దర్శనానికి వెళ్లారు.. కానీ, అప్పుడు అడ్డుకోలేదు.. కానీ, ఇప్పుడు మతాలు గుర్తు వస్తున్నాయి.. ఇలాంటి దుర్మార్గపు కార్యక్రమాలకు, రాజకీయాలకు దేవుడ్ని వాడుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకోడు అని వ్యాఖ్యానించారు.. జగన్ కు కుట్ర, కుతంత్రాలు తెలియవు.. నిజాయితీగా మాట్లాడటమే తెలుసు అని తెలిపారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..

Read Also: Musheer Khan: టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సోదరుడికి ముషీర్‌కు ఘోర ప్రమాదం..

కాగా, ముందుగా నిర్ణయించిన ప్రకారం.. శుక్రవారం రోజు రాత్రికి తిరుమలకు వైఎస్ జగన్ చేరుకోవాల్సి ఉండగా.. ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకునేది ఉంది.. ఇక, జగన్ పర్యటన నేపథ్యంలో.. పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తిరుమల, తిరుపతికి చేరుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.. వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు.. మరోవైపు.. ఉన్నట్టుండి.. తన తిరుమల పర్యటన రద్దు చేసుకుంటున్నట్టు వైఎస్ జగన్ ప్రకటించిన విషయం విదితమే.. అంతేకాదు.. నా మతం మానవత్వం.. డిక్లరేషన్‌లో రాసుకోండి అంటూ ఈ సందర్భంగా వైఎస్ జగన్ వ్యాఖ్యానించిన విషయం విదితమే..