Site icon NTV Telugu

Ambati Rambabu: జగన్‌.. బంగారుపాళ్యం పర్యటనను వివాదం చేసే ప్రయత్నం..!

Ambati

Ambati

Ambati Rambabu: మాజీ సీఎం వైఎస్‌ జగన్ మామిడి రైతాంగాన్ని పరామర్శించే చిత్తూరు జిల్లా పర్యటనకు అడ్డుకునేందుకు.. బంగారుపాళ్యం పర్యటనను వివాదం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. మూడు వేల మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారు. పెట్రోల్ బంకుల వద్ద పోలీసులను కాపలా పెట్టారు. అనేకమందిని హౌస్ అరెస్ట్ చేశారు. హెలీప్యాడ్ వద్ద జనం ఎక్కువ వచ్చారని లాఠీఛార్జ్ చేశారు. విచ్చలవిడిగా పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారు. పోలీసులు ఉంది లా అండ్ ఆర్డర్ కాపాడడానికా… జగన్ పర్యటనను అడ్డుకోవడానికా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..

Read Also: Siddhu Jonnalagadda : కోహినూర్ క్యాన్సిల్.. ‘బ్యాడాస్’ అఫీషియల్

జగన్ బయటకు వస్తున్నారంటేనే వేలమంది పోలీసులు బంగారుపాళ్యం వచ్చారు. జగన్ ను చూడడానికి వీల్లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు అంబటి రాంబాబు.. జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి రైతుల సమస్యలను తెలుసుకుంటున్నారు. అనేక మార్లు అనుమతి లేదని, చివరికి గత్యంతరం లేక అనుమతి ఇచ్చారు. బంగారుపాళ్యం హెలిప్యాడ్ వద్ద అనేక ఆంక్షలు పెట్టారు. పెట్రోల్ బంక్ లో పెట్రోలు కొట్టకుండా నిర్భందిస్తున్నారు. జన సమీకరణ చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ మణికంఠ మాట్లాడడం బాధాకరం అన్నారు.. అయితే, నారా లోకేష్ ఏం చెప్తే అది చేస్తారా..? ఐపీఎస్ అధికారి అనే విషయాన్ని మరిచి నారా లోకేష్ కోసం చెంచాలు మాదిరిగా కొందరు పోలీసులు పని చేస్తున్నారు అని దుయ్యబట్టారు.. అయితే, మీ లాఠీతో జగన్ కు వస్తున్న ఆదరణను ఆపలేరన్నారు.. మామిడి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత పెంచుకుంటుంది. జగన్ మాజీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ప్రజల ప్రవాహాన్ని, ఉప్పెనను మీరు ఆపలేరు.. చిత్తూరు మామిడి పంటను ధర లేక రోడ్ల మీద పడవేసి రైతులు ఆందోళన చెందుతున్నారు. అనేక వాహనాలను తనిఖీ చేసి, కొన్ని వాహనాలకు నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Story board: అంతా రైతు సంక్షేమం గురించి మాట్లాడేవారే.. ఆదుకునే వారు మాత్రం లేరు..!

అసలు, మామిడి రైతులను పరామర్శిస్తే తప్పు ఏంటి..? మీకు ఎందుకు అంత భయం అని నిలదీశారు రాంబాబు.. ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు.. మేము ఎక్కడ జన సమీకరణ చేయటం లేదు. బుర్ర లేని నారా లోకేష్ మాటలు ఐపీఎస్ అధికారులు వినటం బాధాకరం అన్నారు.. కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులు ఒక్కొక్కటి వికటిస్తున్నాయి. ప్రజలకు మీరు మంచి చేస్తే భయం ఎందుకు…? రాష్ట్ర డీజీపీ మాకు కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు.. అందుకే ఆయనకు మళ్లీ పోస్టింగ్ పొడిగిస్తున్నారు.. జగన్ సత్తెనపల్లి పర్యటనలో 113 మంది వైసీపీ శ్రేణులపై అక్రమ కేసులు నమోదు చేశారు.. కూటమి మంత్రులు పేకాట క్లబ్లు నడుపుతున్నారు. రాష్ట్రంలో అక్రమ మద్యం ఏరులై పారుతుంది. గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా ఏపీని మార్చారు. వైసీపీ హయాంలో ప్రజలకు మద్యాన్ని దూరం చేస్తే, కూటమి ప్రభుత్వం మద్యం ప్రజలకు చేరువ చేస్తుందని విమర్శించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..

Exit mobile version