NTV Telugu Site icon

Andhra Pradesh: అంబటి సంక్రాంతి లక్కీ డ్రాలో జాక్‌పాట్.. రూ.16 లక్షల వజ్రాల హారం కైవసం

Sankranti Lucky Draw

Sankranti Lucky Draw

Andhra Pradesh:  వైఎస్ఆర్ పేరుతో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంక్రాంతి లక్కీడ్రాను నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో గుంటూరు‌కు చెందిన గుడే వినోద్ కుమార్ రూ. 16 లక్షల విలువైన వజ్రాల హారాన్ని దక్కించుకున్నాడు. జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం రాత్రి ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, కల్పలతారెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి మంత్రి అంబటి రాంబాబు లక్కీ డ్రా తీశారు. ఇందులో వినోద్ కుమార్ విజేతగా నిలిచి వజ్రాల హారాన్ని దక్కించుకున్నారు.

Read Also: Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్.. రోహిత్, కోహ్లీలను దూరం పెట్టిన బీసీసీఐ

అనంతరం సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు వజ్రాల హారాన్ని వినోద్ కుమార్‌కు అందజేశారు. అయితే వైఎస్సార్ పేరుతో అంబటి రాంబాబు లక్కీ డ్రా నిర్వహిస్తుండడం వివాదాస్పదంగా మారింది. సత్తెనపల్లిలో ఐదేళ్లుగా అంబటి రాంబాబు లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నారన్న జనసేన నాయకుల ఫిర్యాదుపై గుంటూరు జిల్లా కోర్టు స్పందించింది. లక్కీ డ్రా వ్యవహారంపై దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని సత్తెనపల్లి పోలీసులను గుంటూరు ప్రధాన సీనియర్ సివిల్ కోర్డు జడ్జి ఎ.అనిత రెండు రోజుల క్రితం ఆదేశించిన సంగతి తెలిసిందే.