Shocking : బిర్యానీ ప్రియులు తస్మాత్ జాగ్రత్త.! గుంటూరు హోటళ్లలో విస్తుపోయే నిజాలు.!

  • హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడులు
  • అపరిశుభ్ర కిచెన్లు.. బూజు పట్టిన మాంసం స్వాధీనం
  • కెమికల్ రంగులతో ఆహారం తయారీ.. ఆరోగ్యానికి ముప్పు
  • నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లకు నోటీసులు.. లైసెన్స్ రద్దుకు హెచ్చరిక
Food Safety

Food Safety

Guntur Hotel Raids : గుంటూరు నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలే లక్ష్యంగా ఫుడ్ కంట్రోల్ అధికారులు భారీ తనిఖీలు చేపట్టారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఆహారాన్ని విక్రయిస్తున్న నిర్వాహకుల తీరుపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులలో వెలుగు చూసిన దృశ్యాలు వినియోగదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

తనిఖీల్లో భాగంగా అధికారులు హోటళ్లలోని కిచెన్‌లను పరిశీలించి షాక్‌కు గురయ్యారు. వంట గదులు కనీస పరిశుభ్రత లేకుండా, కబేళాల (Slaughter Houses) కంటే అధ్వానంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. గోడలపై బూజు, నేలపై అపరిశుభ్రత మధ్యే ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. హోటల్ సిబ్బంది కనీస ఆరోగ్య సూత్రాలు పాటించకపోవడం గమనార్హం.

OnePlus ధమాకా..! రూ.16 వేలకే అదిరిపోయే ట్యాబ్.. మిస్ అవ్వకండి.!

ఈ దాడుల్లో అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే.. రోజులు, వారాల తరబడి నిల్వ ఉంచిన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్రిడ్జ్‌లలో ఉంచిన చికెన్, మటన్ ముక్కలు తీయడానికి కూడా రానంతగా గడ్డకట్టుకుపోయాయి. ఇది కనీసం మూడు నాలుగు రోజుల క్రితం నాటిదని అధికారులు నిర్ధారించారు. కొన్ని చోట్ల బూజు పట్టిన మాంసాన్ని కూడా వంటకు సిద్ధంగా ఉంచడం కనిపించింది.

ఆహారం ఆకర్షణీయంగా కనిపించేందుకు క్యాన్సర్ కారకమైన కెమికల్ రంగులను విచ్చలవిడిగా వాడుతున్నట్లు గుర్తించారు. ఇవి ప్రజల జీర్ణ వ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయని హెచ్చరించారు. సాధారణంగా పచ్చి మాంసాన్ని, వండిన ఆహారాన్ని వేర్వేరుగా ఉంచాలి. కానీ, గుంటూరులోని ఈ హోటళ్లలో వండిన పదార్థాలను, పచ్చి మాంసాన్ని కలిపి ఒకే ఫ్రిడ్జ్‌లో ఉంచడం కనిపించింది. ఫ్రిడ్జ్‌ల లోపల రక్తం గడ్డకట్టుకుపోయి, భరించలేని దుర్వాసన వస్తున్నా పట్టించుకోకుండా ఆహారాన్ని నిల్వ చేస్తున్నారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిబంధనలు ఉల్లంఘించిన హోటల్ నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. పట్టుబడిన నాణ్యత లేని ఆహార పదార్థాలను వెంటనే సీజ్ చేసి నాశనం చేశారు. “ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే ఏ హోటల్‌ను వదిలిపెట్టం. ఆహార నాణ్యత పెంచే వరకు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. తప్పు చేసిన వారి లైసెన్సులను రద్దు చేయాలని కమిషనర్‌కు నివేదిక పంపిస్తాం” అని ఫుడ్ కంట్రోల్ అధికారి పూర్ణచంద్రరావు స్పష్టం చేశారు.

Yogi Adityanath: “బాబ్రీ మసీదు” ఎప్పటికీ నిర్మితం కాదు.. వారి కలలు నిజం కావు..