NTV Telugu Site icon

Gudivada Amarnath: చంద్రబాబులా అబద్ధాలు చెప్పే అలవాటు మాకు లేదు.. అమర్నాథ్ కౌంటర్

Amarnath On Cbn

Amarnath On Cbn

Gudivada Amarnath Counters On Chandrababu Naidu Manifesto: ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. చంద్రబాబులా అబద్ధాలు చెప్పే అలవాటు తమకు లేదని.. తమది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని కౌంటర్ వేశారు. రామాయపట్నం పోర్టు పనులు చూస్తే, ఎవరికైనా అర్థం అవుతుందని చెప్పారు. నెల్లూరు జిల్లాలోని రామయపట్నం పోర్టుని సందర్శించిన అనంతరం మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించి ఏడాది గడవక ముందే 70 శాతం పూర్తయ్యాయని తెలిపారు. సీఎం జగన్ చెప్పిన విధంగా.. పోర్టు మొదటి దశ పనులను డిసెంబర్ నాటికి ప్రారంభిస్తామని అన్నారు. చంద్రబాబు వేసిన శంకుస్థాపన రాళ్లతో.. పోర్టు బ్రేక్‌స్టోన్స్ వేయొచ్చని సెటైర్లు వేశారు. చంద్రబాబు పనులేమీ చేయకుండా.. రాష్ట్రం మొత్తం కేవలం రాళ్లు వేసుకుంటూ పోయారని ఎద్దేవా చేశారు. పోర్టుతో పాటు ఆధారిత పరిశ్రమల కోసం ఐదు వేల ఎకరాల భూమిని సేకరిస్తామని.. ఈ పోర్టు వల్ల 25 వేల మందికిపైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. అభివృద్ధి చేయలేదని చెప్పే వాళ్లకు.. ఈ పోర్టు పనులు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు.

Yasin Malik: యాసిన్ మాలిక్ ఉరిశిక్ష కోసం ఎన్ఐఏ అభ్యర్థన.. నోటీసులు జారీ చేసిన ఢిల్లీ కోర్టు..

అంతకుముందు.. చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై కూడా మంత్రి అమర్నాథ్ విసుర్లు విసిరారు. అసలు మేనిఫెస్టో అంటే చంద్రబాబుకు అర్థం తెలుసా? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేసే చరిత్ర చంద్రబాబుకు ఉందా? 2014 మేనిఫెస్టో ఎక్కడుందో చంద్రబాబుకైనా తెలుసా? అంటూ నిలదీశారు. పక్క రాష్ట్రాల నుండి కాపీ కొట్టి.. మేనిఫెస్టోనీ విడుదల చేశాడంటూ విమర్శలు గుప్పించారు. ఫేజ్ వన్‌లో ఉచితాలు ఇస్తానన్న చంద్రబాబు.. ఫేజ్ టూలో కిలో బంగారం కూడా ఇస్తానంటాడని ఎద్దేవా చేశారు. కేవలం తన మనుషుల్ని మాత్రమే చంద్రబాబు ‘పూర్ టు రిచ్’ చేస్తాడని.. చంద్రబాబు అధికారంలో సుజనా చౌదరి, సీఎం రమేష్, లింగమనేని, లోకేష్ లాంటి వాళ్లే ధనికులు అయ్యారని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు.. ఎంతమందికి ఉద్యోగం ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లలోనే సీఎం జగన్ యువతకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు కల్పించారన్నారు. 20 లక్షల ఉద్యోగాలు అంటూ చంద్రబాబు యువతను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డాడు. చంద్రబాబు ఎన్ని చెప్పినా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి అమర్నాథ్ తేల్చి చెప్పారు.

Delhi Incident: ఢిల్లీలో 16 ఏళ్ల బాలిక హత్య.. యూపీలో పట్టుబడిన నిందితుడు..

Show comments