NTV Telugu Site icon

వైద్యుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన స‌ర్కార్

anil kumar singhal

క‌రోనా స‌మ‌యంలో వైద్యుల‌కు శుభ‌వార్త చెప్పింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచాలని నిర్ణ‌యం తీసుకుంది.. మీడియాతో మాట్లాడిన ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్.. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచాలని నిర్ణ‌యం తీసుకున్నాం.. రూ. 45 వేల నుంచి రూ. 70 వేలకు పెంచాలని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు.. ఇక‌, జూనియ‌ర్ డాక్ట‌ర్ల డిమాండ్లపై ప్రభుత్వం ప‌రిశీలిస్తోంద‌ని, చ‌ర్చిస్తోంద‌న్నారు.. ప్ర‌స్తుతం సుమారు 350 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు కరోనా విధుల్లో ఉన్న‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు.

మ‌రోవైపు.. తాజా కరోనా కేసుల లెక్కల ప్రకారం ఏపీలో పాజిటివిటీ రేట్ 13.02 శాతంగా ఉంది.. గడచిన 24 గంటల్లో 443 టన్నుల మేర ఆక్సిజన్ వినియోగించారు.. 25 లక్షల మందికి పైగా రెండు డోసులు పూర్తైన‌ట్టు అనీల్ కుమార్ సింఘాల్ తెలిపారు.. 50 లక్షల మందికి పైగా మొదటి డోస్ వేయడం పూర్తైంద‌న్న ఆయ‌న‌.. విదేశాలకు వెళ్లే ఉద్యోగులు.. విద్యార్ధులకు వ్యాక్సినేషన్‌లో ప్రయార్టీ ఉంటుంద‌న్నారు.. విదేశాలకు వెళ్లే వాళ్లు పాస్ పోర్టు నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంద‌న్నారు.. గతంలో ఆధార్ నెంబరుతోనే కోవిన్ పోర్టల్లో రిజిస్టరయ్యేది.. పాస్ పోర్టు నెంబరును కూడా కోవిన్ పోర్టల్లో పెట్టేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరిన‌ట్టు తెలిపారు అనీల్ కుమార్ సింఘాల్.