NTV Telugu Site icon

Andhra Pradesh: భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు పరిహారం..

Assam Floods

Assam Floods

ఏపీలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.. వరదల ధాటికి విజయవాడ అతలాకుతలమైంది. దీంతో.. నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆ సమయంలో అక్కడే ఉండి ఎప్పటికప్పుడూ పరిస్థితిని సమీక్షించారు. ఇదిలా ఉంటే.. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజల అకౌంట్లలోకి ప్రభుత్వం పరిహారం సాయం అందజేసింది.

Read Also: RCB: కోహ్లిని రిటైన్ చేసి ఆటగాళ్లందరినీ విడుదల చేయండి.. ఆర్సీబీకి మాజీ క్రికెటర్ సలహా

ఆస్తి, పంట నష్టం కింద 4 లక్షల మందికి రూ.602 కోట్లు పరిహారం చెల్లింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. నిధులు విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రజల అకౌంట్లలో ఇప్పటివరకు రూ. 569 కోట్లు జమ అయ్యాయి. బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్‌గా లేకపోవడం వంటి కారణాలతో పరిహారం పెండింగ్‌లో ఉన్న వారికి సోమవారం నాటికి చెల్లింపులు జరుగనున్నాయి. వరద సాయం కార్యక్రమంలో భాగస్వాములు అయిన వారితో రేపు విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. వరద సాయంలో పగలు, రాత్రి కష్టపడి పనిచేసిన అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్చంధ సంస్ధలు, పారిశుధ్య కార్మికులు, ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలుపనున్నారు.

Read Also: Hassan Nasrallah Death: నస్రల్లా మరణవార్త విని.. లైవ్‌లో ఎక్కిఎక్కి ఏడ్చేన జర్నలిస్ట్(వీడియో)