Site icon NTV Telugu

Goutham Reddy Cook: దుబాయ్ నుంచి వచ్చాక అస్వస్థత లేదు

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు. గౌతమ్ రెడ్డి ఇంట్లో వంట మనిషి కొమురయ్య అసలేం జరిగిందో వివరించారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు దుబాయ్ నుండి వచ్చారు. నిన్న ఉదయం ఇంట్లోనే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం చేశారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత బయట ఫంక్షన్ ఉంది అని చెప్పి వెళ్లారు.

తిరిగి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చారు. అప్పటినుండి ఇంట్లోనే ఉన్నారు. ఇవాళ ఉదయం 7 గంటల ప్రాంతంలో ఛాతిలో నొప్పి లేస్తుందని కుప్పకూలిపోయారని వెల్లడించాడు కొమురయ్య. వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించారు. రోజూ ఉదయం కాఫీ తాగే వారు కానీ ఇవాళ ఆయన కాఫీ కావాలని అడగలేదు. దుబాయ్ నుండి వచ్చిన తర్వాత గౌతమ్‌ రెడ్డి ఎలాంటి అస్వస్థతకు గురి కాలేదని తెలిపారు కొమురయ్య.

మరోవైపు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో మృతిపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి తెలిపారు. మంత్రిగా రాష్ట్రానికి విశేష సేవలు అందించారు. చిన్న వయస్సులో మృతి చెందడం బాధాకరం. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలి. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని ప్రకటనలో వెల్లడించారు గవర్నర్.

గౌతమ్ రెడ్డి పార్ధివ దేహాన్ని జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసానికి తరలించారు. మంత్రి అనిల్ అక్కడికి చేరుకున్నారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు కోడలు అస్మిత్-నిస్సలతో గౌతమ్ రెడ్డి చివరి సెల్ఫీ

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇక లేరన్న మాట వినడానికే బాధగా ఉంది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠార్మణం తీవ్రంగా కలిచివేసింది. పార్టీలతో సంబంధం లేకుండా గౌతమ్ రెడ్డి అందరితో స్నేహంగా మెలిగేవారు.గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు బాలకృష్ణ.

మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం దిగ్భ్రాంతికరం.రాష్ట్ర మంత్రిగా ఎన్నో సేవలు అందించాల్సిన తరుణంలో కన్నుమూయడం బాధాకరం. విద్యాధికుడైన గౌతమ్ రెడ్డి ప్రజా జీవితంలో హుందాగా వ్యవహరించారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని తండ్రి రాజమోహన్ రెడ్డికి.. కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి అని ప్రకటన విడుదల చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

https://ntvtelugu.com/two-days-of-mourning-in-ap-due-to-minister-goutham-reddy-death/
Exit mobile version