మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు. గౌతమ్ రెడ్డి ఇంట్లో వంట మనిషి కొమురయ్య అసలేం జరిగిందో వివరించారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు దుబాయ్ నుండి వచ్చారు. నిన్న ఉదయం ఇంట్లోనే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం చేశారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత బయట ఫంక్షన్ ఉంది అని చెప్పి వెళ్లారు. తిరిగి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చారు. అప్పటినుండి ఇంట్లోనే ఉన్నారు.…