Andhra Pradesh: ఏపీలో పారిశుధ్య కార్మికులకు శుభవార్త.. హెల్త్ అలవెన్స్ ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Good news to sanitation workers in andhra pradesh: పారిశుధ్య కార్మికులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. పారిశుధ్య కార్మికులకు ఆక్యుపెన్సీ హెల్త్ అలవెన్స్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో నంబర్ 233 ప్రభుత్వం విడుదల చేసింది. నెలకు రూ.6 వేలు ఈ అలవెన్స్ కింద అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం పారిశుధ్య కార్మికులకు మూలవేతనంగా రూ.15 వేలు అందుతోంది. ప్రస్తుతం హెల్త్ అలవెన్స్ కింద అదనంగా రూ.6వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వీరి జీతం రూ.21 వేలకు పెరిగింది. తాజా ఉత్తర్వులతో దాదాపు 43 వేల మందికి పైగా పారిశుధ్య కార్మికులకు లబ్ధి చేకూరనుంది.
Read Also: Deepesh Bhan: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి
Also Read
- CM Chandrababu: తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు అడ్డంకులపై స్పందించిన చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు..
- DSC Candidates: డీఎస్సీ నియామకాల్లో అన్యాయం.. జగన్‌కు ఫిర్యాదు చేసిన అభ్యర్థులు
- Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
ఇటీవల రాష్ట్రంలో తమ జీతాలు పెంచాలంటూ మున్సిపల్, కార్పొరేషన్లలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా ఆరోగ్య భృతిని కూడా తమ డిమాండ్లలో కార్మికులు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పారిశుధ్య కార్మికులతో మంత్రుల కమిటీ చర్చలు జరిపింది. చర్చల అనంతరం కార్మికుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను సీఎం జగన్ ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయంపై అధికారులతో చర్చించి కార్మికులకు హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని నిర్ణయించారు.
తాజావార్తలు
-
Monsoon: అన్నదాతలకు శుభవార్త.. 24 గంటల్లో కేరళను ముద్దాడనున్న తొలకరి వాన
-
Killer Movie Accident: ఎస్.జె.సూర్య ‘కిల్లర్’ సెట్స్‌లో సిలిండర్ బ్లాస్ట్.. ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం!
-
CM Chandrababu: తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు అడ్డంకులపై స్పందించిన చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Annamalai: అన్నామలై రాజీనామా చేయలేదా..?
-
4 Years of Vikram: లోకనాయకుడి ‘విక్రమ్’ కి నాలుగేళ్లు.. నేటికీ చెక్కు చెదరని ఎల్సీయూ (LCU) రికార్డ్స్!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!