Site icon NTV Telugu

Gang War: బెజవాడలో బ్లేడ్ బ్యాచ్ మధ్య గ్యాంగ్ వార్..

Vja Gang

Vja Gang

విజయవాడ నగరం నేరాలకు అడ్డాగా మారుతోంది. గతంలో స్టూడెంట్ల మధ్య గ్యాంగ్ వార్ లు కలకలం రేపాయి. తాజాగా విజయవాడ టూ టౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవించే రెండు బ్లేడ్ బ్యాచ్ ల మధ్య గ్యాంగ్ వార్ స్థానికులను టెన్షన్ పెట్టింది. గత రాత్రి గని అనే బ్లేడ్ బ్యాచ్ సభ్యులకు ఆంజనేయ వాగు సమీపంలో ఉండే సాంబా అనే యువకుడు మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉండి గలాటా చేస్తున్న గని బ్యాచ్ సబ్యులని పట్టుకొని పోలీసులకు అప్పగించారు హరి బ్యాచ్ సభ్యులు. పోలీసులకు అప్పగించారనే కక్ష పెంచుకున్న హరి బ్యాచ్ సభ్యులపై దాడికి దిగారు గని బ్యాచ్ సభ్యులు.

Read Also: Manchu Manoj: భార్య మొదటి పెళ్లికి గెస్ట్ గా వెళ్లిన ఏకైక హీరో నువ్వే భయ్యా..

ఆంజనేయ వాల్ సెంటర్ కొండ ప్రాంతంలో గని బ్యాచ్ సభ్యుడైన అఖిల్ మరో ఆరుగురితో అక్కడికి చేరుకొని బ్లేడ్లతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. దాడిలో తీవ్ర గాయాలు పాలైన అఖిల్, శీను అనే యువకులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు గ్యాంగ్ వార్ కి పాల్పడిన వారిని పట్టుకునే పనిలో పడ్డారు. ఈ గ్యాంగ్ వార్ కారణంగా స్థానికంగా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి.

Read Also:
R Krishnaiah: కేంద్రమంత్రులకి కృష్ణయ్య వార్నింగ్.. బీసీల వాటా ఇవ్వకపోతే రాష్ట్రంలో తిరగనియ్యం
 

Exit mobile version