Srisailam: స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం వేళల్లో మార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీశైలంలో మంగళవారం, శుక్రవారాలలో స్వామివారి ఉచిత స్పర్శదర్శనం వుంటుంది. అయితే ఈ ఉచిత స్పర్శ దర్శనం వేళల్లో మార్పులు చేశారు దేవస్థానం అధికారులు. శ్రీ శైలంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం మంగళవారం నుండి శుక్రవారం వరకు భక్తులకు కల్పిస్తున్న మల్లికార్జునస్వామి స్పర్శ దర్శన వేళలు మార్చాలని దేవస్థానం నిర్ణయించింది.
నేటినుండి నుంచి వారంలో నాలుగు రోజులపాటు అనగా మంగళ వారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటలనుంచి 4 గంటలవరకు భక్తులందరికీ శ్రీస్వామివార్ల ఉచిత స్పర్శదర్శనానికి అనుమతిస్తుంది. గతంలో వారంలోని నాలుగు రోజులలోమంగళ వారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు తిరిగి సాయంత్రం 6 నుంచి 7 వరకు భక్తులందరికీ స్పర్శదర్శనం కల్పిస్తుండేది. అయితే మధ్యాహ్నం 3 తరువాత స్వామివారి అలంకార దర్శనం మాత్రమే వుండటంతో స్పర్శదర్శనం కోసం సాయంత్రం 6 గంటలవరకు వేచి వుండాల్సి వస్తున్నది.
Also Read
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
దీనివలన దర్శనం ముగించుకొని ఇతరప్రాంతాలకు వెళ్ళేందుకు ఇబ్బందికరంగా ఉందని పలువురు భక్తులు దేవస్థానం దృష్టికి తీసుకురావడంతో ఈవిషయమై భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇవాళ్టి నుంచి మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు భక్తులందరికీ స్పర్శదర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో లవన్న తెలియజేసారు. మధ్యాహ్నం గంటసేపు అదనంగా స్పర్శదర్శనం కల్పిస్తున్న కారణంగా సాయంత్రం 6 నుంచి 7 వరకు అమలులో ఉన్న స్పర్శ దర్శనం నిలుపుదల చేస్తామని ఈవో లవన్న తెలిపారు. అలాగే, స్సర్శదర్శనానికి వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించి రావాలని భక్తులను ఈవో లవన్న కోరారు.
TDP : ఆ మాజీమంత్రి మహానాడుకు వెళ్తే ఆదరించరని సందేహం కలిగిందా..?
తాజావార్తలు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!