ప్రకాశం జిల్లాలో టీడీపీ మహానాడు కొనసాగుతోంది. మహానాడులో వివిధ అంశాలపై తీర్మానాలను ప్రవేశపెడుతున్నారు నేతలు. ఇప్పటి వరకు నాలుగు తీర్మానాలను మహానాడులో ప్రవేశపెట్టారు నేతలు. కార్యకర్తలపై ప్రభుత్వ వేధింపులు, బాదుడే బాదుడు, సంక్షేమ పథకాల్లో మోసం, కష్టాల కడలిలో సేద్యం అంశాలపై తీర్మానాలకు మహానాడు ఆమోదం తెలిపింది.
కష్టాలల కడలిలో సేద్యం.. దగాపడుతున్న రైతన్న అంశంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ధూళిపాళ నరేంద్ర. వైసీపీ పాలనలో రాష్ట్ర రైతాంగ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిందన్నారు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర. 45 లక్షల ఎకరాల పంటల సాగు ఉంటే కేవలం 15 లక్షల ఎకరాలకే ఇన్స్యూరెన్స్ ఇచ్చారు. పెట్రో ధరల భారం కారణంగా రైతుల పైనా తీవ్ర భారం పడుతుంది. మోటార్లకు మీటర్లు పెడితే రైతులకు లాభమని మంత్రులు వింత వాదన చేస్తున్నారు.
తెలంగాణ రైతులకు మీటర్ల పెట్టబోమని స్పష్టంగా చెపితే.. జగన్ మీటర్లు పెట్టి ఉరితాళ్లు వేస్తున్నాడు. టీడీపీ హయాంలో రైతులకు ఉన్న పథకాలు అన్నీ ఆగిపోయాయి. రాయల సీమలో ఉండే డ్రిప్ ఇరిగేషన్ పూర్తిగా ఆపేశారు. ఒక్క రూపాయి రైతులకు డ్రిప్ సబ్సిడీ కింద ఇవ్వలేదు. ప్రభుత్వం చెప్పిన రూ. 3 వేల కోట్ల ధరల స్థిరీకరణ ఏమయ్యింది..? ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఉంటే రూ. 1000-1100కు ధాన్యం ఎందుకు అమ్ముకుంటారు..? స్వయంగా వైసీపీ ఎంపీనే ధాన్యం రైతులకు జరుగుతున్న అన్యాయంపై చెప్పింది వాస్తవం కాదా..?
రైతుకు టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసిన దానికంటే ఒక్క రూపాయి కూడా అదనంగా వైసీపీ ఖర్చు చేయలేదన్నారు నరేంద్ర. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్లో నిర్లక్ష్యంపై తీర్మానం ప్రవేశపెట్టారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. దళిత నియోజకవర్గంలో ఉన్న అమరావతిపై కుల ముద్ర వేశారు. అమరావతి నిర్మాణం ఆపేస్తే రాష్ట్రానికి.. దళిత, బడుగులకు నష్టం. ఆరు దళిత నియోజకవర్గావ మధ్యలో అమరావతి ఉందనే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలి. పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు. అత్యంత కీలక ప్రాజెక్టులైన అమరావతి-పోలవరం పూర్తి చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్నారు.
Malla Reddy: దేశంలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే.