మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణపై సస్పెన్షన్ వేటు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ…. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సస్పెండ్ చేసినట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన రావి వెంకటరమణను.. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు.. కాగా, గుంటూరు జిల్లా పొన్నూరు వైసీపీలో వర్గపోరు ఈ మధ్య రచ్చకెక్కింది. ఎమ్మెల్యే కిలారి రోశయ్య వర్గం.. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ వర్గం మధ్య విబేధాలు భగ్గుమన్నాయి.. తాజాగా, పెదకాకాని మండల పార్టీ అధ్యక్షుడు పూర్ణాపై దాడి వ్యవహారం కూడా ఈ రెండు వర్గాల మధ్య వివాదాన్ని రాజేసింది.. మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ వర్గం ఆందోళనకు కూడా దిగింది. ఈ వ్యవహారం మొత్తం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లింది.. వీటికి చెక్పెట్టేందుకు సిద్ధమైన వైసీపీ.. చివరకు రావి వెంకటరమణను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Read Also: Kodali Nani: బాబు, బాలయ్యపై కొడాలి ఫైర్.. షోల పేరుతో ఎన్టీఆర్ను మళ్లీ హింసిస్తున్నారు..!