NTV Telugu Site icon

Ambati Rambabu: పోలవరంపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం

Ambatirambabu

Ambatirambabu

పోలవరం ప్రాజెక్ట్ ఏపీ ప్రజలకు జీవనాడిలాంటిదని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘చంద్రబాబు సీఎం అయ్యాక పోలవరానికి విఘాతం కలుగుతుంది. పోలవరానికి ఉరి అనేది నిజం. పోలవరం ప్రాముఖ్యత, అవసరం, నాయకులతో పాటు ప్రజలకు తెలుసు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి ప్రారంభించిన పనులు ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉంది. ఇరిగేషన్ మంత్రికి తెలియని అంశాలు చాలా ఉన్నాయి. నేను ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు చెప్పాను. డయా ఫ్రమ్ వాల్‌లో లోపాల వల్ల పోలవరం పూర్తి కాదు అని నేను మంత్రిగా ఉన్నప్పుడు చెప్పాను. పోలవరం ప్రాజెక్ట్‌పై అంతర్జాతీయ బృందం పరిశీలించి కూడా అదే రిపోర్ట్ ఇచ్చారు.’’ అని అంబటి తెలిపారు.

ఇది కూడా చదవండి: GST collection: అక్టోబర్‌లో పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..!

‘‘కూటమి ప్రభుత్వం కుట్రకు పోలవరం బలి కాబోతుంది. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ ముఖ్యం అని చెప్పి ప్రత్యేక హోదాను పాతర వేసిన వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు పోలవరాన్ని పాతర వేయబోతున్నారు. ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు అసలు కన్న కొసరు ఎక్కువ మాట్లాడుతున్నారు. పోలవరం స్టోరేజ్ సామర్థ్యం తగ్గిస్తే బ్యారేజీ లాగా మిగిలిపోతుంది. పోలవరం నిర్మాణం ఫేజ్- 1కు పరిమతమై తెలుగుజాతికి ద్రోహం చేయవద్దు. ఫేజ్ 2 కూడా పూర్తి చేస్తే 190 టీఎంసీలు ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ చేయవచ్చు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తుంది. పక్క రాష్ట్రాల ఒత్తిడితో పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని ఆరోపిస్తున్నా. కాంట్రాక్టర్‌ల దగ్గర కమీషన్ కోసమే చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్‌ను కడతామని ఒప్పుకున్నారు.’’ అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: పవన్ మాట్లాడుతుండగా OG..OG అంటూ ఫ్యాన్స్ కేకలు.. రియాక్షన్ ఇదే

‘‘రాష్ట్రంలో ఏం తప్పిదం జరిగినా వైఎస్ జగన్‌పై నింద వేస్తున్నారు. భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో నీటి నిల్వ దశల వారీగానే చేస్తారు. పులిచింతలలో కూడా దశల వారిగానే నీటిని నింపారు. ఇరిగేషన్ మంత్రి, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ మాన్యువల్ ప్రకారం నీటిని నింపుతారు అన్న విషయం తెలుసుకోవాలి. కేంద్ర జలశక్తి కూడా దశల వారీగా నీటి నిల్వకు ఎంత ఖర్చు అవుతుంది అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు. కేంద్ర జలశక్తి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రాజెక్ట్‌ను రాష్ట్రం ఎందుకు చేస్తుంది. రూ.12,157 కోట్లు కేంద్ర నిధుల విడుదలకు గత వైసీపీ ప్రభుత్వమే కారణం. పోలవరాన్ని ఫేజ్ 1 మాత్రమే నిర్మించేలా కేంద్రంతో అంగీకారానికి వచ్చింది. కేబినెట్ సమావేశంలో కూడా అదే నిర్ణయం జరిగింది. కేంద్రం రూ.12,157 కోట్లు విడుదలకు అదే కారణం. రూ.2,348 కోట్లు అడ్వాన్స్ నిధులు ఏం చేశారు. 45.72 టీఎంసీల వరకే ఫేజ్ 1 ఉంటుంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న పాపాలు ప్రజలకు శాపాలు అవుతాయి. పోలవరం అడ్వాన్స్ నిధులు డైవర్ట్ చేసిన కూటమి ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వం నిధులు డైవర్ట్ చేశాం అని అంటుంది.’’ అని అంబటి ధ్వంజమెత్తారు.

 

Show comments